Saturday, June 19, 2021

క్రికెట్ మ్యాచ్‌లో విషాదం.. పిడుగు పడి ఒక‌రు మృతి..

Must Read

క్రికెట్ ఆడుతుండ‌గా పిడుగు పాటుతో ఓ యువ‌కుడు క‌న్నుమూశాడు. ఈ ఘటన ఈ ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగింది.. మ‌రో ఎనిమిది మంది యువ‌కులు గాయాల‌పాల‌య్యారు.. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లె శివారులోని ఈశ్వ‌ర‌మ్మ కాల‌నీలో శుక్ర‌వారం క్రికెట్ ఆట‌కు ప్రారంభించారు స్థానిక యువ‌కులు.. రెండు జ‌ట్లుగా విడిపోయి మ్యాచ్ ఆడుతున్నారు..

అయితే, అదే స‌మ‌యంలో.. భారీ ఉరుములు, మెరుపుల‌తో వ‌ర్షం కుర‌వ‌డం ప్రారంభ‌మైంది.. క్రికెట్ ఆడుతూ.. ఎంజాయ్ చేస్తున్న ఆ యువ‌కులు ఒక్కసారిగా ఊహించ‌ని ఘ‌ట‌న జ‌రిగింది.. పిడుగుపాటుతో రోష‌న్ అనే యువ‌కుడు అక్క‌డిక్క‌డే కుప్పకూలి ప్రాణాలు వ‌దిలాడు..

మ‌రో ఎనిమిది మంది కుర్రాళ్ళు గాయాల‌పాల‌య్య‌రు.. అయితే, క్రికెట్ ఆడుతుండ‌గా.. వ‌ర్షం రావ‌డంతో.. యువ‌కులంతా ఒకే చోటుకు చేర‌డం.. అదే స‌మ‌యంలో పిడుగు ప‌డ‌డంతో.. ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్టు పోలీసులు వివరించారు

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This