Saturday, June 19, 2021

స్పీక‌ర్ త‌మ్మినేని ఆరోగ్య ప‌రిస్థితి.. కొడుకు సంచలన ప్ర‌క‌ట‌న‌

Must Read

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స్పీక‌ర్ తమ్మినేని సీతారాం తీవ్ర అస్వస్థతకు గుర‌య్యార‌న్న వార్త‌లు ఒక్కసారిగా సోషల్ మీడియాలో, న్యూస్ చానల్స్ లో వ‌చ్చాయి.. కుటుంబసభ్యులు ఆయనను తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం హాస్పిటల్లో చికొత్స పొందుతున్న తమ్మినేని.. అయితే, త‌మ్మినేని ఆరోగ్య‌ప‌రిస్థితిపై ఆయ‌న కొడుకు చిరంజీవి నాగ్ తాజాగా ఓ ప్ర‌క‌ట‌న విడుదల చేశారు..

నాన్నగారు ఆరోగ్యంగానే ఉన్నారు.. డీ హైడ్రేషన్ కు గురైనందున జ్వరం వ‌చ్చింద‌ని.. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నందున కొంచెం నీరసంతో పాటు ముందు జాగ్రత్త కోసమే హాస్పిటల్లో చేర్చిన‌ట్టు వివరించారు.. ప్రస్తుతం నాన్నగారి రిపోర్టులన్నీ బాగానే ఉన్నాయ‌న్న త‌మ్మినేని కొడుకు.. జ్వరం నుంచి కోలుకున్నారు..

మా అందరితో చక్కగా మాట్లాడుతున్నారు.. అభిమానులు , కార్యకర్తలెవరూ ఆందోళన చెందాల్సిన అవ‌స‌రం లేదని.. రెండు, మూడు రోజుల్లో డిశ్ఛార్జి అవుతార‌ని ప్ర‌క‌టించారు. కాగా, గ‌త నెల‌లో క‌రోనావైర‌స్ బారిన ప‌డి త‌మ్మినేని సీతారాం దంప‌త‌లు ఇపుడు మరోసారి ఇలా జరగడంతో కుటుంబసభ్యులు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This