Tuesday, July 27, 2021

టెన్త్, ఇంటర్ ప‌రీక్ష‌లపై ఏపీ ప్ర‌భుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు

Must Read

క‌రోనా వైర‌స్ దేశంలో కొన్ని లక్షల మంది ప్రాణాలను బలి తీసుకుంది. అయితే చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించాయి.. కొన్ని రాష్ట్రాలు మాత్రం పరీక్షలను రద్దు చెయ్యలేదు.. దీంతో తల్లిదండ్రుల్లో గందరగోళం నెలకొంది. తాజాగా ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయ‌టం లేదంటూ దాఖ‌లైన పిటిష‌న్ల‌పై సుప్రీం కోర్టులో ‌స్పందించింది. ప‌రీక్ష‌లు ర‌ద్దు చేయ‌ని ఏపీ స‌ర్కార్ స‌హ నాలుగు రాష్ట్రాల‌కు నోటీసులు జారీ చేసింది.

ఏపీలో ఇప్పటికి వరకు ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్ ప‌రీక్ష‌లను ర‌ద్దు చేయ‌లేదు. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై ఏపీ ప్ర‌భుత్వం కీల‌క స‌మీక్ష నిర్వ‌హించింది. సీఎం జ‌గ‌న్ ఉన్న‌తాధికారుల‌తో భేటీ అయి… ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కే మొగ్గుచూపారు. క‌రోనా స‌మ‌యంలోనే కేర‌ళ‌, చ‌త్తీస్ ఘడ్, బీహర్ రాష్ట్రాలు ప‌రీక్ష‌లు నిర్వ‌హించాయి. 18 రాష్ట్రాలు ఇప్ప‌టికే ప‌రీక్ష‌లు ర‌ద్దు చేయ‌గా, ఏపీ పంజాబ్ అస్సాం రాష్ట్రాలు ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై తుది నిర్ణ‌యం ప్రకటించాల్సి ఉంది.

ఏపీలో జులై 7 నుండి 25వ‌ర‌కు ఇంట‌ర్ ప‌రీక్ష‌లు, జులై 26 నుండి ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు నిర్వ‌హించే యోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉంది. 5ల‌క్ష‌ల మంది ఇంట‌ర్ విద్యార్థులు, 4.5ల‌క్ష‌ల మంది ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థులు ప‌రీక్ష‌లు రాయాల్సి ఉన్నది.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This