Friday, July 30, 2021

సీఎం జగన్ పై సుప్రీంకోర్టు సీరియస్.. ఒక్క ప్రాణం పోయినా మీదే బాధ్యత..!

Must Read

ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలపై అటు స్టూడెంట్స్ లో ఇటు తల్లిదండ్రుల్లో తీవ్ర అసహనం కొనసాగుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది.. రాష్ట్రంలో పరీక్షల నిర్వహణపై అఫిడవిట్‌ వేయలేదని, రెండు రోజుల్లో దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

అసలు ఆంధ్రప్రదేశ్‌ను ఎందుకు మినహాయించాలో చెప్పాలంటూ నిలదీసింది అత్యున్నత న్యాయస్థానం. ఒక్క విద్యార్థి ప్రాణం పోయినా రాష్ట్రమే బాధ్యత వహించాలని వ్యాఖ్యానించింది. అయితే, 11వ తరగతి పరీక్షలను సెప్టెంబర్‌లో జరుపుతామని సుప్రీంకోర్టుకు తెలియజేసింది కేరళ సర్కార్.. కానీ, ఏపీ నుంచి స్పష్టత లేదని అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

ఇన్ని రోజులైనా అఫిడవిట్‌ ఎందుకు వేయలేదని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. కాగా, పరీక్షల రద్దు విషయంలో ఏపీ సహా నాలుగు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు గురువారం నోటీసులు జారీ చేసారు

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This