Home Politics తెలంగాణలో లాక్‌డౌన్‌ సడలింపులపై గందరగోళం

తెలంగాణలో లాక్‌డౌన్‌ సడలింపులపై గందరగోళం

0

తెలంగాణలో లాక్‌డౌన్‌ను మరో పది రోజులు పొడిగిస్తూ.. మంగళవారం ప్రకటించింది కేసిఆర్ ప్రభుత్వం.. గతంలో విధించిన లాక్‌డౌన్ ఇవాళ కూడా అమల్లో ఉండనుంది.. కొత్త లాక్‌డౌన్ సడలింపులు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి.. కానీ, ఈ విషయంలో అర్ధం కాక ప్రజలు ఇవాళ మధ్యాహ్నం 2 గంటల తర్వాత కూడా భారీగా రోడ్లపైకి వస్తున్నారు..

గురువారం నుండి ఉదయం 6 నుండి సాయంత్రం 5 గంటల వరకు.. ఇంటికి చేరుకోవడానికి అదనంగా మరో గంటతో సాయంత్రం 6 గంటల వరకు పర్మిషన్ ఇచ్చారు.. కానీ, అది ఈరోజు నుంచే అనే భ్రమలో ఉన్న ప్రజలు.. ఈ విషయాన్ని అర్ధం చేసుకోకుండా అనవసరంగా రోడ్లపైకి వస్తున్నారు.. దీనిపై ప్రజలకు అవగాహాన‌‌ కల్పించాలని.. అనవసరంగా రోడ్లపైకి వస్తే చర్యలు తీసుకోవాలని పోలీసులను ప్రభుత్వం ఆదేశించింది.

Exit mobile version