Tuesday, July 27, 2021

తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు : “తెలంగాణ పాలిట వైఎస్ రాక్షసుడే జగన్‌ అంతకంటే ఎక్కువే”

Must Read

కృష్ణా జలాలపై ఇరు ప్రభుత్వాలూ ఎవరి వాదనలు వారే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చేసి వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు తారాస్థాయికి చేర్చాయి.

కృష్ణా జలాలపై ఇరు ప్రభుత్వాలూ ఎవరి వాదనలు వారే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చేసి వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు తారాస్థాయికి చేర్చాయి.

  ఆంధ్రోళ్లందరూ తెలంగాణ వ్యతిరేకులేనంటూ మంగళవారం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగిన విషయం తెలిసిందే. తాజాగా, తన వ్యాఖ్యలపై మంత్రి ప్రశాంత్‌రెడ్డి వివరణ ఇచ్చారు. ఈ మేరకు లేఖ విడుదల చేసిన ఆయన.. తమ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌, నల్లగొండ, ఖమ్మం రైతుల పొట్టగొట్టే అక్రమ ప్రాజెక్టులు కట్టిన, కట్టే ప్రయత్నం చేస్తున్న ఆంధ్ర పాలకులను ఉద్దేశించే తాను మాట్లాడానని, రాయలసీమ, ఆంధ్ర ప్రజలను ఉద్దేశించి కాదని మంత్రి పేర్కొన్నారు.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు బద్ధ వ్యతిరేకి అని, సోనియాగాంధీకి తెలంగాణ ఇవ్వాలని ఉన్నా ఆయనే అడ్డుపడి అనేక మంది తెలంగాణ బిడ్డల చావుకు కారణం అయ్యారని దుయ్యబట్టారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని అణచివేయడానికి ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపించారు.

వైఎస్‌ని మించి రెట్టింపు నీటిని తరలించేందుకు ప్రయత్నిస్తున్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని ఏమనాలి? అని మంత్రి వేముల ప్రశ్నించారు. వైఎస్ ముమ్మాటికి తెలంగాణ పాలిట రాక్షసుడేనని విమర్శించారు. అంతేకాదు, తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు తరలించిన నీటి దొంగేనన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను తేల్చడానికి ఏళ్ల తరబడి తాత్సారం చేస్తున్న కేంద్రంపై ఉద్యమించి, అక్రమ ప్రాజెక్టులు కడుతున్న ఏపీ వైఖరికి నిరసనగా ఆందోళనలు చేపడతామని మంత్రి తెలిపారు.

‘రెండు రాష్ట్రాల రైతులు బాగుండాలనేదే కేసీఆర్‌ విధానం.. ఒక్క శ్రీశైలం నుంచే పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి లిప్టు ద్వారా రోజుకు 9.12 టీఎంసీల నీటిని మళ్లించేందుకు అనుమతులు లేని ప్రాజెక్టుల నిర్మాణానికి ఏపీ సర్కారు సిద్ధమయ్యింది.. పాలమూరు, డిండి ఉమ్మడి రాష్ట్రంలోనే అనుమతులు పొందిన పాత ప్రాజెక్టులు. ఇప్పటికైనా జాతీయ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ ఇచ్చిన ఆదేశాలను పాటించి అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం ఆపాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నా’ అని స్పష్టం చేశారు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This