Friday, July 30, 2021

హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్‌ పదునైన వ్యూహం

Must Read

హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్‌ వ్యూహం ఏంటి? ఉద్యమ నాయకులు ప్రచారం చేస్తారా ? గత ఉపఎన్నికలకు భిన్నంగా పార్టీలో సీనియర్లను రంగంలోకి దించుతున్నారా? ఆసక్తి రేకిత్తిస్తోన్న గులాబీ పార్టీ వ్యూహాలు మీ కోసం…

హుజురాబాద్‌లో గెలుపు కోసం తెరాస ప్రణాళిక

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామాతో ఖాళీ అయిన హుజురాబాద్‌లోనూ వ్యూహాలకే పదునుపెడుతోంది గులాబీ పార్టీ. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ స్ట్రాటజీ పక్కాగా ఉంటుంది. ఉపఎన్నికల్లో అంతకు మించిన వ్యూహాలు అధికార పార్టీ సొంతం. ఉపఎన్నిక షెడ్యూల్‌ వచ్చే నాటికే.. హుజురాబాద్‌ నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో పట్టు సాధించాలనే లక్ష్యంతో పావులు కదుపుతోందట.

మండలస్థాయిలో పట్టు కోసం పని మొదలైంది

ఇప్పటికే మండలాల వారీగా హుజురాబాద్‌ నియోజకవర్గంలో ఇంఛార్జ్‌లను నియమించింది టీఆర్‌ఎస్‌. పార్టీ పిలుపు అందుకున్న నాయకులు.. తమకు అప్పగించిన ప్రాంతాలకు వెళ్లిపోయారు. అక్కడ కాలు పెడుతూనే ఎన్నికల ప్రణాళికల్లో మునిగిపోయారట. గ్రామస్థాయిలో ఉపఎన్నికకు టీఆర్‌ఎస్‌ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. నిత్యం వారితో మాట్లాడటం.. ప్రజల అటెన్షన్‌ తీసుకొచ్చేందుకు చేపట్టాల్సి పనులపై దిశానిర్దేశం చూస్తున్నట్టు సమాచారం.

ఈటలకు ఉద్యమనాయకుల ద్వారానే కౌంటర్‌

తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన టీఆర్‌ఎస్‌ నేతలను, ఎమ్మెల్యేలను, మంత్రులను, అక్కడ మోహరింప చేయనున్నట్టు తెలుస్తోంది. బీజేపీ నుంచి బరిలో దిగాలని చూస్తోన్న ఈటల రాజేందర్‌.. పదే పదే తాను ఉద్యమకారుడినని చెప్పుకొంటున్నారు. టీఆర్‌ఎస్‌లో తనను విమర్శించేవాళ్లంతా పార్టీలోకి మధ్యలో వచ్చినవాళ్లేనని తిప్పికొడుతున్నారు. ఈ విషయంలో ఈటలకు గట్టిగానే కౌంటర్‌ ఇవ్వాలని నిర్ణయించిందట టీఆర్‌ఎస్‌. హుజురాబాద్‌ ఉపఎన్నిక కోసం ఇప్పటికే అక్కడ పనిచేస్తున్నారు.

ఎక్కువ మంది ఉద్యమ నాయకులు సిద్ధం

 మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌, మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మరికొందరు ప్రజాప్రతినిధులను హుజురాబాద్‌ పంపబోతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వినోద్‌కుమార్‌ ఆల్‌రెడీ ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఉపఎన్నిక ప్రచారం ఊపందుకున్న తర్వాత ఉద్యమ నాయకులు మరికొంత మంది వెళ్తారని.. ఇందుకోసం జాబితా కూడా సిద్ధమైందని తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌లోని ఉద్యమ నాయకులు పెద్ద సంఖ్యలో హుజురాబాద్‌లో మోహరిస్తే ఈటల మాటలకు గట్టిగా కౌంటర్‌ ఇవ్వొచ్చని అనుకుంటోంది అధికారపార్టీ శిబిరం.

పదునెక్కుతున్న టీఆర్‌ఎస్‌ గెలుపు వ్యూహాలు

ఇప్పటికే హుజురాబాద్‌ ఉపఎన్నికలను మంత్రి హరీష్‌రావు, మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ ఇద్దరూ పర్యవేక్షిస్తున్నారు. గెలుపు వ్యూహాలను పదునెక్కిస్తున్నారు. దీంతో గతంలో జరిగిన ఉపఎన్నికలకంటే హుజురాబాద్‌ ఉపపోరు రసవత్తరంగా సాగుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This