Saturday, June 19, 2021

అన్‌లాక్‌: జూన్ 7 నుంచి అన్ని ఓపెన్..!

Must Read

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభ‌ణ‌తో అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌గా.. మ‌రికొన్ని రాష్ట్రాలు క‌ర్ఫ్యూ పేరుతో క‌ఠిన రూల్స్ పెట్టి జనం గుంపులుగా లేకుండా చేస్తున్నారు.. అయితే ఒకానొక టైం లో దేశంలో కేసులు 4 ల‌క్షల‌కు పైగా న‌మోదు కాగా.. క్ర‌మంగా త‌గ్గుతూ ఇప్పుడు ల‌క్షకు చేరువ‌య్యాయి.. మృతుల సంఖ్య కూడా త‌గ్గుతూ వ‌స్తోంది.. ఇదే స‌మ‌యంలో.. గుజరాత్‌లో కరోనా కొత్త కేసులు భారీగా త‌గ్గుముఖం ప‌ట్టాయి..

దీనితో లాక్‌డౌన్ నుంచి క్ర‌మంగా అన్‌లాక్‌కు వెళ్లోంది ఆ రాష్ట్రం.. ఇవాళ భారీగా స‌డ‌లింపులు ప్ర‌క‌టించారు.. ఈ నెల 7వ తేదీ నుంచి 100 శాతం హాజ‌రుతో అన్ని ఆఫీసుల‌ను ఓపెన్ చేసుకునేందుకు అనుమ‌తి ఇచ్చింది ప్ర‌భుత్వం.. ఇప్ప‌టికే 36 న‌గ‌రాల్లో అన్ని షాపుల‌ను ఉద‌యం 9 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కూ తెరిచేందుకు అనుమ‌తి ఇవ్వ‌గా.. రెస్టారెంట్ల హోం డెలివ‌రీ సేవ‌ల‌కు మాత్రం రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు అనుమ‌తిచ్చిందిప్రభుత్వ.

అయితే, లాక్‌డౌన్ రూల్స్ ‌ మాత్రం జూన్ 11వ తేదీ వ‌ర‌కు కొన‌సాగుతాయ‌ని ప్ర‌క‌టించింది.. నైట్‌ క‌ర్ఫ్యూ ఈ నెల 11వ తేదీ వ‌ర‌కు పొడిగించిన‌ట్టు ప్ర‌క‌భుత్వం పేర్కొంది. తాజాగా ఆ రాష్ట్రంలో 1200కు పైగా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, మ‌రో 17 మంది మృతిచెందారు.. అయితే, ప్ర‌స్తుతం అన్ని కార్యాల‌యాలు 50 శాతం ఉద్యోగుల‌తో నడుస్తున్న విషయం తెలిసిందే..!

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This