Saturday, June 19, 2021

షాకింగ్: ఒక మ‌హిళ‌ శరీరంలో 216 రోజులు కరోనా వైరస్

Must Read

కరోనా మొద‌టివేవ్‌లో పెద్ద‌గా ప్ర‌భావం చూప‌ని క‌రోనా, సెకండ్ వేవ్‌లో వీర విజృంభ‌ణ చేస్తోంది. ప్ర‌తి దేశంపై క‌రోనా త‌న ప్ర‌భావాన్ని చూపుతున్న‌ది. ఎవ‌రిలోనైతే రోగ‌నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా, ప్రాణాంత‌క‌మైన వ్యాధుల‌తో ఇబ్బందులు ప‌డుతుంటారో వారిపై క‌రోనా తీవ్ర‌మైన ప్ర‌భావం చూపుతున్న‌ది. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు HIV సోకిన వ్య‌క్తుల్లో క‌రోనా సోకుతున్న‌ట్టు ఎలాంటి ఆధారాలు లేవు

మొదటిసారి ఇలాంటి కేసులు ద‌క్షిణాఫ్రికా దేశంలో బ‌య‌ట‌ప‌డుతున్నాయి. క్వాజులు నాటాల్ ప్రాంతానికి చెందిన ఓ మ‌హిళ‌కు HIV సోకింది. అప్ప‌టి నుంచి ఆమె వ్యాధినిరోధ‌క శ‌క్తి త‌గ్గుతూ వ‌స్తున్న‌ది. అయితే, స‌ద‌రు మ‌హిళ‌కు గ‌తేడాది సెప్టెంబ‌ర్ నెల‌లో క‌రోనా సోకింది. ఆ త‌రువాత ఆమె ఆసుప‌త్రితో చేరింది. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అంటే 216 రోజుల‌పాటు స‌ద‌రు మ‌హిళ‌లో వైర‌స్ ఉండ‌టం వైద్యుల‌ను ఆందోళనకు గురిచేసింది.

మరో షాకింగ్ విషయం ఏంటంటే..ఆమెలో క‌రోనా 32 మ్యూటేష‌న్లు ఉన్నాయ‌ని డాక్టర్లు గుర్తించారు. ఇందులో ప్రాణాంత‌క‌మైన ఈ404కె ర‌కం వేరియంట్ ఉండ‌టం ఆంధోళ‌న క‌లిగిస్తోందని తెలిపారు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This