Tuesday, July 27, 2021

కేటీఆర్ నియోజకవర్గంలో షర్మిల.. గుర్తుండిపోయే కానుక ఇచ్చిన సిరిసిల్ల నేతన్న

Must Read

తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటుచేస్తున్నట్టు ప్రకటించిన వైఎస్ షర్మిల.. అందుకు కార్యాచరణను రూపొందిస్తున్నారు. ఈ కార్యాచరణలో భాగంగా షర్మిల జిల్లాల్లో పర్యటిస్తున్నారు. తాజాగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో షర్మిల పర్యటిస్తున్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యాన్ని తీసుకురావడమే తన లక్ష్యమని ప్రకటించిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె షర్మిల… అందుకు తగ్గట్టుగానే అడుగులు వేస్తున్నారు.

కార్మిక క్షేత్రం సిరిసిల్లలో జిల్లాలో షర్మిలకు వైఎస్ఆర్ అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఏర్పాటు చేయబోయే కొత్త పార్టీ సన్నాహక కమిటీ సభ్యులు ఆమెకు స్వాగతం పలికారు. సిరిసిల్లలోని డాక్టర్ పెంచలయ్య ఇంటికి వెళ్లిన షర్మిలకు.. అగ్గిపెట్టెలో ఇమిడే చీరలను ఆయన బహుకరించారు.

ఎల్లారెడ్డిపేట మండలం ఆల్మాస్‌పూర్‌లో కరోన బాధిత కుటుంబాలను పరమర్శించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని 14 కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థిక సహాయం చేయనున్నారు. అనంతరం కరీంనగర్‌లో లంచ్ చేసి సింగరేణి కార్మికులను కలవనున్నారు. తమ సమస్యలపై సింగరేణి కార్మికుల నుంచి వినతి పత్రాన్ని స్వీకరించనున్నారు. తొలిసారి రాజన్న సిరిసిల్ల జిల్లాకు షర్మిల రావడంతో అభిమానులనుంచి అపూర్వ స్వాగతం లభించింది.

డిగ్రీ పట్టా పట్టుకొని రోడ్డు మీదకొచ్చే తమ్ముళ్లు, చెల్లెమ్మల కోసం ఉద్యోగ బాటలు వేస్తానని తెలిపారు. చిన్నారులకు నాణ్యమైన విద్యను అందిస్తానన్నారు. మెరుగైన వైద్యం కోసం పడిగాపులు కాసే పరిస్థితిని సమూలంగా మార్చేస్తానని చెప్పారు. ‘సకల జనుల తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగుతానని.. త్వరలో మంచి రోజులొస్తున్నాయని ప్రజలకు భరోసా ఇచ్చారు. ముసలవ్వలు నడిచేందుకు ఊతకర్రనవుతానని, బడి ఫీజులు కట్టలేక అవస్థలు పడుతున్న ఇంటికి పెద్దక్కనవుతాను ’అని గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో షర్మిల పేర్కొన్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసీఆర్ పై అవకాశం దొరికినప్పుడల్లా తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు. తద్వారా టీఆర్ఎస్ కు తామే ప్రత్యర్థులమనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.తెలంగాణలో రాజన్న రాజ్యాన్ని తీసుకురావడమే తన లక్ష్యమని ప్రకటించిన ఆమె… అందుకు తగ్గట్టుగానే అడుగులు వేస్తున్నారు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This