Saturday, June 19, 2021

వైఎస్ ష‌ర్మిల పార్టీ పేరు ఇదే..! షాక్ లో జగన్

Must Read

తెలంగాణ‌లో రాజ‌కీయ పార్టీ పెట్ట‌డంపై ఇప్ప‌టికే క్లారిటీ ఇచ్చారు వైఎస్ ష‌ర్మిల‌… మ‌రోవైపు.. వివిధ జిల్లాల అనుచ‌రులు, వైఎస్ అభిమానుల‌తో చాలా మీటింగ్స్ కూడా నిర్వ‌హించారు.. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై గవర్నమెంట్ ను నిల‌దీస్తూ దీక్ష‌లు కూడా చేశారు. త్వ‌ర‌లోనే పార్టీ పేరు, జెండా, అజెండా ప్ర‌క‌టించేందుకు సిద్ధం అవుతున్నారు..

అయితే, వైఎస్ ష‌ర్మిల పెట్ట‌బోయే పార్టీ పేరుపై ఓవైపు ప్ర‌చారం జ‌రుగుతున్నా.. సోష‌ల్ మీడియాలో ఖాతాలో అదేపేరుతో ద‌ర్శ‌న‌మిస్తున్నా.. పార్టీ పేరు ప్ర‌క‌టించే వ‌ర‌కు వేచిచూడాల్సిందేన‌ని అభిప్రాయాల‌ను కూడా కొంత‌మంది వ్య‌క్తం చేశారు.. ఎట్టకేలకు వైఎస్ ష‌ర్మిల పెట్ట‌బోయే పార్టీ పేరు.. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా ఫైన‌ల్ అయ్యింది.. ఇదే పేరుతో రాజకీయ పార్టీని రిజిస్టర్ చేశారు షర్మిల ముఖ్య అనుచరుడు వాడుక రాజగోపాల్..

అంతేకాదు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని ఓ జాతీయ పత్రిక లో ప్ర‌క‌ట‌న కూడా ఇచ్చారు.. ఇక‌, YSR తెలంగాణ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన‌ అన్ని డాకుమెంట్స్ ను కేంద్ర ఎన్నికల కమిషన్‌కు అందజేశారు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This