Wednesday, June 23, 2021

IPL 2021: దుబాయ్ లో కొత్త షెడ్యూల్ ఇదే.. ఫైనల్స్ ఎప్పుడంటే?

Must Read

క‌రోనా మహామ్మారి కారణంగా అర్ధాంతరంగా మ‌ధ్య‌లోనే ఆగిపోయిన IPL 14 సీజ‌న్ ను పూర్తి చేసేందుకు బీసీసీఐ కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబ‌ర్ 19 నుండి IPL మ్యాచులు జ‌రుగుతాయ‌ని, యూఏఈ వేదిక‌గా ఐపీఎల్ కంటిన్యూ అవుతుంద‌ని ప్రకటించారు. ఫైన‌ల్ మ్యాచ్ అక్టోబ‌ర్ 15 ద‌స‌రా రోజు జరగబోతుందని తెలిపారు.. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

ఐపీఎల్-14 సీజ‌న్ లో ఇప్ప‌టికే 29 మ్యాచ్‌లు పూర్త‌యిన ఐపీఎల్‌ 2021లో మ‌రో 31 మ్యాచ్‌లు జ‌ర‌గాల్సి ఉంది. దీనికోసం క‌నీసం 25 రోజుల స‌మ‌యం దొరికినా చాలు.. టోర్నీని పూర్తి చేస్తామ‌ని బీసీసీఐ ముందునుంచి చెబుతూ వ‌స్తోంది. అందుకు అనుగుణంగా వేదిక‌లు, మ్యాచులు జరగనున్నాయి

భారత్ లో క‌రోనా కేసులు త‌గ్గినందున ఇక్క‌డే నిర్వ‌హించాల‌ని మొద‌ట భావించారు. కానీ ఇండియాలో వ‌ర్షాకాలం మొద‌ల‌వుతుండ‌టం, ఇండియాలో బ‌యో బ‌బుల్ పై విదేశీ ఆట‌గాళ్ల‌లో అనేక భ‌యాందోళ‌న‌లున్న నేప‌థ్యంలో యూఏఈ వేదిక‌గా ఐపీఎల్ నిర్వ‌హించాల‌ని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది

Latest News

ఆనందయ్య మందు ఫిలింఛాంబర్‌లో పంపిణీ. ఏ విధంగా వేసుకోవాలి, ఏం తినకూడదో చెప్తూ వివరణ

సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఆనందయ్య మందు పంపిణి చేయమని కోరుతున్నారు. అందరి కోరిక మేరకు కరోనా నియంత్రణలో భాగంగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్...

More Articles Like This