Tuesday, July 27, 2021

సచిన్‌ రికార్డును బద్దలు కొట్టబోతున్న మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్…

Must Read

మహిళల క్రికెట్‌ ప్రపంచంలో సచిన్ టెండూల్కర్ గా పేరు తెచ్చుకొని ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న మిథాలీ రాజ్ ఇప్పుడు సరికొత్త రికార్డు సొంతం చేసుకోబోతుంది. గత రెండు దశాబ్దాలుగా మహిళా క్రికెట్ అభిమానులకు అలరిస్తున్న మిథాలీ రాజ్ అత్యధిక కాలం క్రికెట్ ఆడిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పబోతుంది.

ప్రపంచ మహిళల క్రికెట్‌లో పలు రికార్డులను సొంతం చేసుకున్న భారత కెప్టెన్ మిథాలీ రాజ్ అద్భుతమైన రికార్డును కైవసం చేసుకోబోతోంది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును మిథాలీ బద్దలుకొట్టబోతోంది. అంతర్జాతీయ క్రికెట్లోకి మిథాలి 1999 జూన్ 26న ఆరంగేట్రం చేసింది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌తో 22 ఏళ్లను పూర్తి చేసుకుంది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక కాలం ఆడిన రికార్డు టెండూల్కర్ పేరున ఉంది. సచిన్ 22 ఏళ్ల 91 రోజులు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగారు. మరో మూడు నెలల పాటు మిథాలీ క్రికెట్ ఆడితే సచిన్ రికార్డును తిరగరాస్తుంది. ప్రస్తుతం మిథాలీ టీ-20కి గుడ్‌బై చెప్పేసింది. కేవలం వన్డేలు, టెస్టులు మాత్రమే ఆడుతోంది. వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్‌కు ఆడి, క్రికెట్‌కు వీడ్కోలు పలకాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This