ఉద్యోగి మరణిస్తే వారి PF అకౌంట్ డబ్బులు ఏమౌతాయి? వాటిని ఎవరు విత్‌డ్రా చేసుకోవచ్చు? పూర్తి వివరాలు!

140

ఉద్యోగం చేసే వారికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జాబ్ చేసే ప్రతి ఒక్కరు కూడా PF అమౌంట్ ను వెనుకేస్తూనే ఉంటారు. అయితే ఈపీఎఫ్‌వో తన కస్టమర్స్ కు ఎన్నో రకాల సేవలు అందిస్తోంది. ఈ మధ్యనే PF అమౌంట్ కోసం పీఎఫ్ ఆఫీస్‌‌లు, కంపెనీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా PF సేవలను ఆన్‌లైన్ చేస్తూ వస్తోంది. పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. పదవీ విరమణ వరకు ఆగాల్సి అవసరం లేదు. ముందుగా కూడా డబ్బులు తీసుకోవచ్చు. అయితే ఐదేళ్లలోపు పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేస్తే ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుంది. అలాగే పీఎఫ్ విత్‌డ్రా అవసరం ప్రాతిపదికన మారుతుంది. ఈపీఎఫ్ అకౌంట్ ఉన్న వారు పీఎఫ్ డబ్బు కోసం ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవచ్చు. యూఏఎన్ (యూనివర్శల్ అకౌంట్ నెంబర్) పోర్టల్లోకి లాగిన్ అయి ఈ ప్రాసెస్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. దాదాపు 75 శాతం వరకు ఈపీఎఫ్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవడానికి ఈపీఎఫ్‌వో గతేడాది అనుమతినిచ్చింది. అయితే ఉద్యోగం కోల్పోయి నెల రోజులు దాటి ఉండి, ఎలాంటి ఎంప్లాయిమెంట్ లేకపోతే మిగతా 25 శాతాన్ని కూడా వెనక్కు తీసుకోవచ్చు. అయితే ఉద్యోగం చేస్తున్నా కూడా ఈపీఎఫ్ మొత్తాన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే వెనక్కు తీసుకోగలం. హెల్త్ బాగాలేకపోయినా, పెళ్లి ఖర్చులు ఉన్నా, పిల్లల చదువు, ఇల్లు కొనాలన్నా కూడా ఈ పీఎఫ్ మొత్తాన్ని మనం తీసుకోవచ్చు.

ఒకవేళ పీఎఫ్ అకౌంట్ ఉన్న ఉద్యోగి మరణిస్తే? అప్పుడు పీఎఫ్ డబ్బులు ఏమౌతాయి? ఎవరు ఆ పీఎఫ్ డబ్బులు తీసుకోవచ్చు? ఇలాంటి ప్రశ్నలు చాలానే వస్తాయి. పీఎఫ్ సబ్‌స్క్రైబర్ మరణించిన తర్వాత అకౌంట్‌ నామినీకి పీఎఫ్ డబ్బులు వస్తాయి. అంటే పీఎఫ్ ఖాతాదారుడు ఏ కారణం చేతనైన మరణిస్తే మాత్రం అకౌంట్‌ లోని డబ్బులు మొత్తంగా నామినీగా తీసుకోవచ్చు. దీని కోసం ఈపీఎఫ్‌వో ఆఫీస్‌కు కూడా వెళ్లాల్సిన అసవరం లేదు. ఆన్‌లైన్‌ లోనే సులభంగా పీఎఫ్ డబ్బులను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఉద్యోగులు వారి మరణం తర్వాత పీఎఫ్ డబ్బులు ఎవరికి వెళ్లాలనే అంశాన్ని ముందుగానే ఆలోచించుకోవాలి. నచ్చిన వారిని పీఎఫ్ అకౌంట్ నామినీగా రిజిస్టర్ చేసుకోవాలి. దీని కోసం EPFO ఆన్‌లైన్ ఈ-నామినేషన్ సదుపాయం అందిస్తోంది. పీఎఫ్ అకౌంట్‌కు నామినీని జత చేసుకునేందుకు ఇనామినేషన్ ఫెసిలిటీ ఉపయోగపడుతుంది. EPFO వెబ్‌సైట్‌ కు వెళ్లి ఈ పని పూర్తి చేసుకోవచ్చు. యూఏఎన్ నెంబర్, ఆధార్ నెంబర్‌తో లింక్ అయ్యి ఉంటేనే ఈ ఫెసిలిటీ పొందగలం. పీఎఫ్ అకౌంట్ నామినీని మార్చుకునే సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ఆన్‌లైన్‌లోనే ఈ పని కూడా పూర్తి చేసుకోవచ్చు. ఇక్కడ నామినీ ఆధార్ కార్డు నెంబర్ కచ్చితంగా అవసరం అవుతుంది.

Image result for ఉద్యోగి మరణిస్తే PF అకౌంట్

ఉద్యోగి మరణించిన తర్వాత నామినీ లేదా బెనిఫీషియరీ ఈపీఎఫ్ కంపొసైట్ డెత్ క్లెయిమ్ ఫామ్‌ను ఆన్‌లైన్‌లోనే ఈపీఎఫ్‌వోకు సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఒటీపీ వస్తుంది. దీన్ని ఎంటర్ చేస్తేనే క్లెయిమ్ ప్రాసెస్ పూర్తవుతుంది. లేదంటే ఈపీఎఫ్‌వో ఆఫీస్‌కు వెళ్లి పీఎఫ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న లింక్‌ ఓపెన్ చేసి పీఎఫ్ క్లెయిమ్ కోసం అప్లై చేసుకోవచ్చు. https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/no-auth/nomineeAppForm/viewNomineeAppForm?HDIV_STATE=15-9-34DC7EC99A2A2C02DADA0FF1A625284D

Content above bottom navigation