ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్ : పీఎఫ్ వడ్డీ రేటు తగ్గింపు, రూ.700 కోట్ల మిగులు

81

మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే మీకు బ్యాడ్ న్యూస్. 2019-20 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును భారీగా తగ్గించింది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. EPFO ఉద్యోగులకు ఇది పెద్ద షాక్ అనే చెప్పుకోవాలి. 2019-20 ఆర్థిక సంవత్సరనికి గాను వడ్డీ రేటును ఏడేళ్ల కనిష్టానికి తగ్గించింది. ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ తాజాగా ఈపీఎఫ్ అకౌంట్‌పై వడ్డీ రేటును 8.5 శాతానికి తగ్గించింది. ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు తగ్గింపు నిర్ణయాన్ని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ మంత్రి సంతోష్ గాంగ్వార్ మీడియాకు తెలిపారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను వడ్డీ రేటును 8.5 శాతానికి తగ్గించడంతో 6 కోట్లకు పైగా ఈపీఎఫ్ఓ సబ్‌స్క్రైబర్లపై ప్రభావం పడనుంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను వడ్డీ రేటు 8.65 శాతంగా ఉంది. 2016-17లోను 8.65 శాతంగా ఉంది. 2017-18లో దీనిని 8.55 శాతంగా ఉంది. 2015-16లో మాత్రం 8.8 శాతం వడ్డీ రేటు ఇచ్చింది. 2013-14, 2014-15 సంవత్సరాలలో 8.75 శాతం ఉంది. ఇప్పుడు 2012-13లో ఉన్న వడ్డీ రేటుకు (8.5 శాతం) తగ్గించింది. అంటే 15 బేసిస్ పాయింట్లు తగ్గించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2019-20 లో వడ్డీ రేటును 8.50 శాతానికి తగ్గించడం మాత్రం ఖాతాదారులకు వచ్చే వడ్డీకి గండి కొట్టినట్టే. ప్రభుత్వం నిర్వహిస్తున్న పొదుపు పథకాల వడ్డీ రేట్ల సమాన స్థాయికి ఈపీఎఫ్ వడ్డీ రేట్లను తీసుకురావాలని కార్మిక శాఖను ఆర్థిక మంత్రిత్వ శాఖ కోరినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వడ్డీ రేటును ఈపీఎఫ్ఓ తగ్గించడంతో ఖాతాదారులకు రావాల్సిన వడ్డీ తగ్గుతుంది. తాజా నిర్ణయంతో EPFOకు రూ.700 కోట్ల మిగులు ఉంటుందని కేంద్రమంత్రి వెల్లడించారు. 8.55 శాతం వద్ద ఈ ఏడాది చివరి నాటికి ఈ రిటైర్మెంట్ ఫండ్ బాడీకి రూ.300 కోట్ల సర్‌ప్లస్ ఉంటుందని అంచనా. ఈపీఎఫ్ఓ 8.55 శాతాని కంటే ఎక్కువ వడ్డీ రేటు అందిస్తే లోటు ఉండేదని అంటున్నారు.

Image result for పీఎఫ్ వడ్డీ రేటు తగ్గింపు

ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా ఈపీఎఫ్ఓ వడ్డీ రేటును స్మాల్ సేవింగ్ స్కీంకు అనుగుణంగా సవరించాలని కార్మిక మంత్రిత్వ శాఖను కోరినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పీఎప్ అకౌంట్‌పై వడ్డీ రేటు తగ్గింపు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈపీఎఫ్ఓ వడ్డీ రేటుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతి అవసరం. ఈపీఎఫ్ఓ నిర్ణయంతో ఉద్యోగులు, కార్మికులకు పీఎఫ్ ఫండ్‌పై వచ్చే ప్రతిఫలం తగ్గుతుంది. ప్రతి సంవత్సరం భవిష్యనిధి నిల్వలపై సగటున దాదాపు రూ.32 నుండి రూ.34 వేల కోట్ల వడ్డీ వస్తోంది. ఈపీఎస్ కింద వడ్డీ, ఇతర ఆదాయాన్ని పరిగణలోకి తీసకొని నిర్వహణ ఖర్చులు తీసివేయగా మిగతా మొత్తాన్ని సబ్‌స్క్రైబర్లకు వడ్డీ రూపంలో ప్రతిఫలంగా చెల్లిస్తారు.

Content above bottom navigation