ఏపీ డ్వాక్రా మహిళల రుణమాఫీ ఎప్పుడు ఇస్తారు?

393

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు శుభవార్త అందించింది. బ్యాంకు లింకేజీ ద్వారా డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలకు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద వడ్డీ చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అయింది. మహిళల బ్యాంకు అకౌంట్ లో రూపాయి జమ చేసి తర్వాత పూర్తి వడ్డీ చెల్లించనుంది. లక్ష రూపాయల లోపు తీసుకున్న డ్వాక్రా మహిళలకు 4 విడతల్లో రుణమాఫీ చేయనుంది. ఆ డబ్బులు జమ చేసే లోగా 6 నెలలకోసారి వడ్డీ చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధం అయింది. 2019 ఏప్రిల్ 11వ తేదీకి ముందు తీసుకున్న రుణాలు మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం రూ.840 కోట్ల డ్వాక్రా రుణాలను మాఫీ చేయనున్నారు. నాలుగు విడుతల్లో ఈ రుణమాఫీ చేయనున్నారు.

వైసీపీ నవరత్నాల్లో అత్యంత కీలకమైన హామీ, ఏపీ మహిళా లోకం మొత్తం సంతోషించే ఏకైక హామీ వైయస్సార్‌ ఆసరా పథకం. తాము అధికారంలోకి రాగానే 89 లక్షల మంది డ్వాక్రా మహిళలకు సంబంధించిన రుణాలను నాలుగు విడతల్లో మాఫీ చేస్తానని, దాదాపు రూ. 15 వేల కోట్ల మాఫీచేసి ఆ సొమ్మును ఆయా సంఘ మహిళల చేతికే ఇస్తామని ప్రకటించారు. అంతేకాదు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తామని మహిళలకు వైయస్సార్‌ ఆసరా ఓ భరోసా ఇస్తుందని తెలిపారు, అందుకు తగ్గట్టుగానే వైయస్సార్‌ ఆసరా పథకంపై సమీక్షలు జరిపిన జగన్‌ ఆ శాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీచేశారు. ఇప్పటివరకూ డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలు ఎన్ని, ప్రస్తుతం వారి అప్పుల ఖాతాలలో ఉన్న సొమ్ము ఎంత, అనే విషయాలపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని, జిల్లా కలెక్టర్లు ఈ వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదించాలని ఆదేశించారు. దాంతో ఏపీ వ్యాప్తంగా డ్వాక్రా రుణాలు ఇచ్చిన బ్యాంకులు ఆయా సంఘాల వివరాలను ఓ నివేదికలో పొందుపరచి ఉన్నత అధికారులకు అందజేస్తున్నారు. మార్చి నెలలో జగన్‌ ఇచ్చిన హామీ ప్రకారం మొదటి విడత డ్వాక్రా రుణమాఫీ జరగనునందని విశ్వసనీయ సమాచారం.

Image result for ఏపీ డ్వాక్రా మహిళల రుణమాఫీ ఎప్పుడు ఇస్తారు?

తమ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించిన మహిళల రుణం తీర్చుకుంటామని ఆ పార్టీ నేతలు ఘంటాపథంగా చెబుతున్నారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మహిళలు, రైతులు, చేనేతలు ఇలా అన్ని రంగాల వారికి హామీలిచ్చి వారిని నిట్టనిలువునా మోసం చేశారని గుర్తుచేశారు. మరీ ముఖ్యంగా రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణ మాఫీ చేయకపోవడంతో ఈ రెండు వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని చెప్పారు. ముఖ్యంగా చివరి మూడు నెలల్లో చంద్రబాబు డ్వాక్రా మహిళలను మాయచేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, కానీ, జగన్‌మోహన్‌ రెడ్డి నీతిగా, నిజాయితీగా రుణమాఫీ ఎలా చేసేది ముందే ప్రజలకు వివరించారన్నారు. మళ్లి చంద్రబాబును ఎన్నుకుంటే చివరి రెండుమూడు నెలల కాలమే తమను మళ్లి ఏదో ఒక పథకం పేరుతో మోసం చేస్తారని, కానీ జగన్‌మోహన్‌ రెడ్డిని నమ్ముకుంటే విడతల వారీగా రుణమాఫీ, పావలా వడ్డీకి రుణాలు మళ్లి వస్తాయని మహిళలు గట్టిగా నమ్మినందునే తమకు పట్టం కట్టారని చెబుతున్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముఖ్యమంత్రి డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు బాసటగా నిలచేందుకు రెడీ అవుతున్నారని సమాచారం.

Content above bottom navigation