ఏప్రిల్ 1 నుంచి రేషన్ హోమ్ డెలివరీ.. సిద్ధం చేసిన అధికారులు

107

ఆంధ్ర ప్రదేశ్ లో వరుసగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్న సీఎం జగన్ ఇప్పటికే స్వర్ణ బియ్యం ఏప్రిల్ నుండి రాష్ట్రవ్యాప్తంగా పంపిణి జరుగుతుంది అని చెప్పిన సంగతి తెలిసిందే. ఇకనుంచి ఏపీలో రేషన్ బియ్యంకోసం చౌక ధరల దుకాణాలకి వెళ్లాల్సిన అవసరం లేదు.. నాణ్యమైన బియ్యాన్ని ప్రభుత్వం ఇకనుంచి మీ ఇంటికే డోర్ డెలివరీ చేయబేతోంది. ప్రభుత్వం కొత్తగా రిక్రూట్ చేసుకోనున్న గ్రామ వాలంటీర్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

ఏప్రిల్ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నాణ్యమైన బియ్యం పంపిణి చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. నేడు పౌరసరఫరాలశాఖపై జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పౌరసరఫరాల శాఖమంత్రి కొడాలి నాని, సీనియర్‌ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాల్లో అందుబాటులో ఉన్న నాణ్యమైన బియ్యం, నిల్వలపై వివరాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు అధికారులు. నాణ్యమైన బియ్యం సరఫరాకు 26.63 లక్షల టన్నులు అవసరం కాగా, ఖరీఫ్‌లో, రబీలో పంట ద్వారా 28.74 లక్షల టన్నులు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలియజేసారు. వివిధ జిల్లాల్లో సేకరించిన నాణ్యమైన బియ్యం నమూనాలను సీఎం పరిశీలించారు.

Image result for ఏప్రిల్ 1 నుంచి రేషన్ హోమ్ డెలివరీ

ఏప్రిల్‌ 1 నుంచి అన్ని జిల్లాల్లో నాణ్యమైన బియ్యం పంపిణీ ప్రారంభం చేయాలనీ అధికారులను సీఎం ఆదేశించారు. ఏప్రిల్‌నుంచి జిల్లాకో నియోజకవర్గం చొప్పున ప్యాక్‌చేసిన నాణ్యమైన బియ్యం పంపిణీ చేయనున్నారు. ఏప్రిల్‌ 1 నాటికి 22 నియోజకవర్గాలు, మే నాటికి 46 నియోజకవర్గాలు, జూన్‌ నాటికి 70 నియోజకవర్గాలు, జులై నాటికి 106, ఆగస్టు నాటికి 175 నియోజకవర్గాల్లో ప్యాక్‌చేసిన నాణ్యమైన బియ్యం పంపిణీ చేయనున్నారు అధికారులు.

నాణ్యమైన బియ్యం పంపిణీకోసం 30 చోట్ల 99 నాణ్యమైన బియ్యం ప్యాకింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. 5, 10, 15 కిలోల బియ్యం సంచులను ఏప్రిల్ 1 నుంచి నేరుగా ఇంటికే డోర్ డెలివరీ చేస్తారు. బియ్యం, కందిపప్పు, పంచదారతోపాటు మరో రెండు లేదా మూడు నిత్యావసర సరుకులను గ్రామ వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయాలని, పర్యావరణానికి హానిజరగకుండా బియ్యాన్ని ప్యాక్‌చేయడానికి వాడుతున్న సంచులను తిరిగి సేకరించేలా చూడాలని సీఎం ఆదేశించారు. జగన్ ఆదేశం మేరకు అధికారులు ఏప్రిల్ 1 నుంచి రేషన్ హోమ్ డెలివరి జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. జగన్ చేసిన ఈ ప్రకటనతో ఏపీ ప్రజలు సంతోషంగా ఉన్నారు.

Content above bottom navigation