కొత్త పెన్షన్ కార్డులతో మరొక ట్విస్ట్..

132

ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ల లొల్లి కొనసాగుతుంది. ఏపీ ప్రభుత్వం వ్యవహార శైలి ఎవరికీ అర్థంకాని విధంగా ఉంది. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి పథకం కూడా ప్రజలకు లబ్ది చేకూరేలా లేదు. అంతేకాకుండా గ్రామాలలో ఉండే నాయకుడు తమ సొంత పార్టీ వారికే లబ్ది చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఉంది. ఏపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పింఛన్ పథకం విషయంలో తీసుకున్న నిర్ణయాలు అందరినీ సంతోషంలో ముంచెత్తాయి. అయితే కొత్త మార్గదర్శకాలతో ఊహించని చిక్కు ఇప్పుడు పెన్షన్ లబ్దిదారులను నిద్ర పోనివ్వటం లేదనే భావన వ్యక్తమవుతున్నది. సామాజిక పింఛన్లు పొందేవారి వయోపరిమితిని ప్రభుత్వం 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించింది. ఈ నేపథ్యంలో కొత్తగా ఆరు లక్షలమందిని ఈ పథకంలో చేర్చటం సంతోషం కలిగించే అంశం అయితే, కొత్తగా ఆరు లక్షల మందికి పింఛన్ మంజూరు చేసినట్టే చేసి, పాతవారిలో ఏకంగా ఏడులక్షలమందికి పింఛన్ కట్ చేయించారు.

ఏపీలోని వైసీపీ సర్కార్ గత నెల 13వ తేదీన పెన్షన్ పథకానికి కొత్త మార్గదర్శకాలను ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా చాలామంది పింఛన్ పథకానికి అనర్హులుగా మారారు. సాధారణంగా మార్గదర్శకాలను కొత్తగా లబ్ధిదారుల లిస్ట్ లోకి చేరే వారికీ వర్తింపజేయాలి. అలాగే చేస్తారు అని అనుకున్నారు కూడా. కానీ కొత్తవారికి పాతవారికి అందరికీ కలిపి ఒకే నిబంధనలు అమలులోకి తీసుకురావడంతో, సామాజిక పింఛను దారులకు పెద్ద కష్టం వచ్చి పడింది. కొత్త నిబంధనల ప్రకారం చాలా మంది పెన్షన్ కోల్పోనున్నారు. గతంలో నిబంధనలు పెద్దగా పట్టించుకోకుండా పెన్షన్లు మంజూరు చేశారు. కానీ ఇప్పుడు సర్కార్ వాటిని తొలగిస్తుంది. సొంత కారు ఉన్నా, నెలవారీ విద్యుత్ చార్జీలు 300 యూనిట్ల కంటే ఎక్కువ ఉన్నా అనర్హులే. పట్టణాల్లో చిన్న ఇల్లున్న వారికి గతంలో పెన్షన్లు ఇచ్చారు. ఇప్పుడు 750 చదరపు అడుగుల కంటే ఎక్కువ ఉన్న కుటుంబాలకు కూడా పెన్షన్ తొలగించడంతో వారి పరిస్థితి దారుణంగా తయారయ్యింది.

Image result for ap new pension status

ప్రభుత్వం వర్గాల సమాచారం ప్రకారం… ఏపీలో అన్ని రకాల పెన్షన్‌ లు కలుపుకోని ఫిబ్రవరి వరకు మొత్తం 54,68,322 మంది లబ్దిదారులు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో వీళ్ళందరికీ 20 వ తేదీ వరకు గ్రామ, వార్డు వాలంటీర్లు కొత్త పెన్షన్ కార్డులు పంచనున్నారు. అయితే ఇప్పటికే చాలామంది అర్హులైన వారిని పెన్షన్ పధకం నుంచి తప్పించారు. సొంత పార్టీ వాళ్ళకే అర్హత లేకపోయినా ప్రభుత్వ పధకాలు లబ్ది చేకూరేలా చూస్తున్నారు అని ప్రజల్లో వ్యతిరేకత బలంగా వినిపిస్తుంది. అయితే అర్హులైన వారిలో ఎవరైనా పెన్షన్ విషయంలో ఇబ్బందులు తలెత్తితే, వారిని తిరిగి జాబితాలో చేర్చేలాగా మరోసారి సర్వే జరపనున్నట్లు తెలుస్తుంది. జగన్ సర్కార్ రాగానే కొత్తగా 6,14,244 మందికి పింఛన్లు ఇస్తున్నాం అన్న ప్రచారాన్ని బలంగానే ప్రభుత్వం చేసుకుంటున్నా, ప్రజలకు ఉపయోగ పడేలా ఈ ప్రభుత్వం చెయ్యడం లేదని జనాలలో వినిపిస్తున్న మాట. ఇక మిగతా పథకాలలో కూడా ఇలాగె జరుగుతుంది. దాంతో ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వస్తుంది. మాది ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న క్రమంలో, ప్రజల్లో వస్తున్న ఈ సన్నపాటి వ్యతిరేకత ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.

Content above bottom navigation