జగనన్న మరొక శుభవార్త.. అమ్మఒడి రెండవ విడత డబ్బులు

191

జగనన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకాలు వసతి దీవెన, విద్య దీవెన, అమ్మఒడి. ఈ మూడు పథకాలు కూడా చదువుకునే స్టూడెంట్స్ కోసం జగన్ తీసుకొచ్చాడు. అయితే వీటిలో కొన్ని పథకాలు కొందరికి అందితే కొందరికి మాత్రం అందడం లేదు. ఇప్పుడు దానికి సంబందించిన న్యూసే మీకు చెప్పబోతున్నాను. అమ్మఒడి, వసతిదీవెనకు సంబందించిన డబ్బు మీ అకౌంట్ లో పడకపోతే ఈ వీడియో పూర్తీగా చుడండి.

జగన్ అన్న వసతి దీవెన పథకం కింద 11 లక్షల 87 వేల మందికి ఒక్కొక్కరికి 10 వేల నుండి 20 వేల వరకు స్కాలర్ షిప్ లభిస్తుంది. అలాగే జగనన్న విద్యా దీవెన కింద కాలేజ్ కోర్స్ లు చదివే స్టూడెంట్స్ పూర్తీ ఫీజులు మంజూరు చేసే పథకం కింద 3700 కోట్లు ఖర్చు అవుతాయి. అలాగే అమ్మఒడి పథకం కింద 42 లక్షల మంది తల్లుల ఖాతాలో 82 లక్షల మంది స్టూడెంట్స్ కు, ఒక్కొక్కరికి 15 వేల చొప్పున 6400 కోట్లు జమ కావడం స్టార్ట్ అయ్యింది. మూడు పథకాలకు రూ. 12 వేల 400 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. వసతి దీవెన, అమ్మఒడి డబ్బులు ఇప్పటికే చాలామంది అకౌంట్ లో పడ్డాయి. అలాగే కొంతమందికి అమ్మఒడి డబ్బు, వసతి దీవెన డబ్బు పడలేదు. ఇలా డబ్బులు పడనివాళ్ళు ఆలస్యం చెయ్యకుండా, తగిన ఆధారాలతో గ్రామా సచివాలయంలో వెల్ఫేర్ ఎజుకేషన్ ఆఫీసర్స్ వద్దకు వెళ్లి ఎడిట్ లేదా రీ వెరిఫికేషన్ చేయించుకుంటే 72 గంటల్లో మీ అకౌంట్ లో డబ్బు పడుతుందని అధికారులు చెప్పారు.

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి నవరత్నాల్లో ఉన్న ప్రతి ఒక్క పథకం అందుతుందని చెప్పారు. మీకు అర్హత ఉంటె సంబంధిత అధికారినిని, మీకు ఆ పథకం లబ్ది అందే వరకు వదలవద్దని చెప్పారు. మీకు ఏ కారణం వలన అమ్మఒడి, వసతి దీవెన డబ్బు పడలేదో అధికారులను అడిగి తెలుసుకోవాలన్నారు. అది సరైనది కాకపోతే తగిన ఆధారాలతో వెంటనే ఎడిట్ చేసుకోవాలని వివరించారు. ఇలా చేస్తే 72 గంటల్లో మీరు మీ డబ్బును పొందవచ్చు. ఇక ఇంటర్ స్టూడెంట్స్ కు ప్రభుత్వం ఇప్పటివరకు స్కాలర్ షిప్ రిలీజ్ చెయ్యలేదు. అందుకే కొన్ని కాలేజ్ లు స్టూడెంట్స్ కు వసతి దీవెన డబ్బులను కాలేజ్ లో కట్టాలని చెప్తున్నట్టు తెలుస్తుంది. స్కాలర్ షిప్ కు, దీనికి ఎలాంటి సంబంధం లేదని, అలా ఎవరైనా అడిగితే కంప్లైంట్ చెయ్యాలని అధికారులు వివరిస్తున్నారు. కాబట్టి అర్హత ఉండి ఇంకా వసతి దీవెన, అమ్మఒడి డబ్బులు రాకపోతే వెంటనే గ్రామ సచివాలయానికి వెళ్లి ఎందుకు రాలేదో కనుక్కోండి.

Content above bottom navigation