జగన్ మరో నూతన పథకం… సంవత్సరానికి 20,000

59

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రముఖ్యమంత్రి వివిధ పథకాలను తీసుకొచ్చి రాష్టాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నారు. ఇప్పుడు మరో కీలక సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టబోతోంది సర్కార్. జగనన్న వసతి దీవెన పథకాన్ని సీఎం జగన్‌ ఇవాళ ప్రారంభిస్తారు. ఈ క్రమాన్ని విజయనగరం జిల్లా వేదికగా ప్రారంభించబోతున్నారు. ఇక, ఈ పథకం వల్ల ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ ఆపై చదువులు అభ్యసించే పేద విద్యార్థులకు లాభం చేకూరనుంది. ఈ పథకం ద్వారా 11.87 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. ఐటీఐ విద్యార్థులకు పది వేల రూపాయయలు.. పాలిటెక్నిక్‌ విద్యనభ్యసించే వారికి 15 వేల రూపాయలు సాయం చేయనుంది ప్రభుత్వం. ఇక డిగ్రీ, ఆపై కోర్సుల విద్యార్థులకు 20 వేల రూపాయల మేర ఆర్థిక సాయం అందనుంది. ఈ పథకం అమలు కోసం ప్రత్యేకంగా కార్డులు జారీ చేయనుంది ప్రభుత్వం. అర్హత ఉన్న ప్రతి విద్యార్థికీ యూనిక్‌ బార్‌ కోడ్‌తో కూడిన కార్డు ఇవ్వనున్నారు సీఎం జగన్‌. ఇవి కూడా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయడం ద్వారా అమ్మఒడి తరహా విధానం పాటించనున్నారు. రెండు విడతల్లో విద్యార్థుల వసతి, భోజనం కోసం ఆర్థిక సహాయం చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం జగనన్న విద్యా దీవెన పథకం అమలుచేస్తుండగా.. భోజనం, వసతి సౌకర్యాల కోసం జగనన్న వసతి దీవెన పథకాన్ని ప్రవేశపెడుతున్నారు. పేదరికంలో ఉన్న ఏ విద్యార్థి కూడా విద్యకు దూరం కాకూడదన్న సంకల్పంతో జగనన్నవసతి దీవెన పథకం అమలు చేస్తున్నారు. అయితే ఈ పథకాన్ని స్టూడెంట్స్ అర్హులు కావాలంటే వారికి కొన్ని అర్హతలు ఉండాలి. అవేమిటంటే..

  • స్టూడెంట్స్ రాష్ట్ర విశ్వవిద్యాలయాల బోర్డులకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేట్ కాలేజ్ లలో చదువుతూ ఉండాలి.
  • డే స్కాలర్ స్టూడెంట్స్, హాస్టల్ స్టూడెంట్స్ 75 శాతం హాజరు కలిగి ఉండాలి.
  • ఇంట్లో ఎవరికి కూడా కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలు ఉండకూడదు. ఇక ప్రభుత్వ ప్రయోజిత పథకాల కింద టాక్సీలు, ఆటోలు, ట్రాక్టర్లు తీసుకున్న కుటుంబాలకు మినహాయింపు ఉంటుంది.
  • ఇక పట్టణాలలో కమర్షియల్, రెసిడెన్షియల్ ఏరియాల్లో 1500 చదరపు అడుగులలో ఇల్లు ఉన్నవారు కూడా అర్హులే.
  • దూర విద్య, ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీల్లో చదువుతున్న వారు, మేనేజ్‌మెంట్ కోటా కింద చేరిన వారు, కుటుంబ సభ్యుల్లో ప్రభుత్వ ఉద్యోగి, పెన్షనర్ ఉన్న వారు అనర్హులు.
  • కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.50 లక్షల కంటే తక్కువ ఉండాలి. కుటుంబానికి 10 ఎకరాల మాగాణి, 25 ఎకరాల మెట్ట భూమి ఉండవచ్చు. లేదా.. మెట్ట, మాగాణి కలిపి 25 ఎకరాల లోపు ఉండాలి.వార్షికాదాయంతో సంబంధం లేకుండా శానిటరీ వర్కర్స్ పిల్లలు అర్హులు.
CM YS Jagan Launch Jagananna Vasathi Deevena At Vizianagaram - Sakshi

ఆయా కళాశాలల యాజమాన్యాలే అర్హత గల విద్యార్థుల పూర్తి వివరాలను జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో ఆయా విభాగాలకు అప్‌ లోడ్ చేస్తాయి. ఆదాయ పరిమితి పెంచినందున తహశీల్దార్ ఇచ్చే ధ్రువీకరణ పత్రాన్ని పరిగణనలోకి తీసుకుని కొత్త విద్యార్థులకు అర్హత కల్పిస్తారు. ఈ పథకం వల్ల విద్యా రంగంలో డ్రాపవుట్లు గణనీయంగా తగ్గే వీలుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ముఖ్యంగా 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండి, ఇంటర్‌ తర్వాత కళాశాలల్లో చేరుతున్న వారికి సంబంధించిన కేవలం 23 శాతం మాత్రమే ఉందని.. ఈ పథకంతో ఆ పరిస్థితిలో మార్పు వస్తుందని ప్రభుత్వ భావిస్తోంది.

Content above bottom navigation