పాత పెన్షన్‌, బియ్యం కార్డుఫై సీఎం జగన్ సంచలన నిర్ణయం…

రాష్ట్రంలో పెన్షన్ అందడం లేదని అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. కొత్తగా 6,14,244 పెన్షన్లు ఇచ్చినా.. పెన్షన్లు తీసేశారని ఫిర్యాదులు అందుతున్నాయి. దీనిపై జగన్ ఇప్పుడు దృష్టి సారించారు. అర్హులెవరికైనా ఈ నెల పెన్షన్ అందకపోతే వారికి రెండు నెలల పెన్షన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైఎస్ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వివిధ పథకాలు అందడం లేదని ప్రజల నుంచి వినతులు వచ్చాయని వెల్లడించారు. సాంకేతిక కారణాల వల్లే కొందరికి పథకాలు అంది ఉండకపోవచ్చని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. రైతు భరోసా కింద ఇంకా 21,750 రైతుల కేసులు పెండింగ్ ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించి డబ్బు అందించాలని సీఎం జగన్ ఆదేశించార. కలెక్టర్లు సానుకూల దృక్పథంతో ఉండాలని సూచించారురు. కొత్తగా 6,14,244 పెన్షన్లు ఇచ్చామని, అయినా పెన్షన్లు తీసేసినట్లు ఫిర్యాదులు వస్తున్నట్లు చెప్పారు.

Image result for jagan mohan reddy

మళ్లీ వెరిఫికేషన్‌ చేసి ఎవరికైనా అర్హత ఉందని తేలితే.. ఒకేసారి రెండు నెలల పెన్షన్‌ ఇస్తామని జగన్ వెల్లడించారు. రేషన్ కార్డుల విషయంలోనూ రీ వెరిఫికేషన్‌ పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 17 నాటికి కలెక్టర్లు రీ వెరిఫికేషన్‌ పూర్తి చేయాలని, 18వ తేదీ కల్లా అప్‌లోడ్‌ చేసి, 19, 20 తేదీల్లో సోషల్‌ ఆడిట్‌ నిర్వహించాలని సూచించారు. ఈ నెల 20 నాటికి తుది జాబితా ప్రకటించాలని ఆదేశించారు. మార్చి ఒకటో తేదీన కార్డుతో పాటు, పెన్షన్‌ ఇవ్వాలన్నారు. అలాగే అమ్మ ఒడి పథకం కింద 42,33,098 మందికి డబ్బు అందజేసినట్లు చెప్పారు. ఇంకా 11,445 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్తున్నట్లు పేర్కొన్నారు.

Image result for pension andra pradesh

ఇళ్ల పట్టాలకు సంబంధించి కూడా కొన్ని అంశాలు తన దృష్టికి వచ్చాయని సీఎం జగన్ చెప్పారు. స్పందన కార్యక్రమం ద్వారా దాదాపు 2 లక్షల చిల్లర వినతులు వస్తే 1.03 లక్షలకు ఆమోదం తెలిపినట్లు తెలిపారు. కరెంటు బిల్లులు ఎక్కువగా రావడం వల్ల దాదాపు 40 వేల వినతులను పెండింగులో పెట్టినట్లు తెలిపారు. అయితే పూరి గుడిసెలో ఉన్నవాళ్లకూ కరెంటు బిల్లు ఎక్కువగా వచ్చిందని ఇళ్లు పట్టాలు ఇవ్వడం ఆపేయడం సరైన చర్య కాదని స్పష్టం చేశారు. గ్రామ వలంటీర్‌ ద్వారా లబ్ధిదారులను గుర్తించి.. ఇళ్ల పట్టా పొందడానికి అర్హుడు అని అనిపిస్తే వెంటనే ఇళ్లపట్టా ఇవ్వాలని ఆదేశించారు. ఇళ్లపట్టాలకు అవసరమైన భూమిని మార్చి 1 కల్లా సిద్ధంచేయాలన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ కార్డులు కూడా ఫిబ్రవరి 15 నుంచి పంపిణీ చేస్తామని సీఎం జగన్‌ వెల్లడించారు. అలాగే అమ్మ ఒడి పథకం కింద 42,33,098 మందికి డబ్బు అందజేసినట్లు చెప్పారు. ఇంకా 11,445 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్తున్నట్లు వాటిని వెంటనే పరిష్కరించాలని అన్నారు.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation