పెన్షన్ తీసుకునేవారికి గుడ్ న్యూస్ : పెన్షన్ కమ్యూటేషన్‌ కు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్

168

కేంద్ర ప్రభుత్వ పెన్షను తీసుకునేవారికి గుడ్‌ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసింది. దీనికి సంబంధించి కేంద్ర కార్మిఖ శాఖ ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ కొత్త మార్పులను నోటిఫై కూడా చేసింది. దీంతో ఏకంగా 6.3 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలుగనుంది. పెన్షన్ మొత్తం భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. అయితే ఇది కేవలం కమ్యుటేషన్ ఆప్షన్ ఎంచుకున్న వారికే వర్తిస్తుంది.

పెన్షన్ కమ్యూటేషన్ తో ఒక పెన్షనర్ తన మొత్తం డబ్బులో కొంత భాగాన్ని ముందుగానే విత్‌ డ్రా చేసుకునే ఫెసిలిటీ ఉండేది. ఆ తర్వాత మిగిలిన డబ్బులు 15 ఏళ్ల వరకు పెన్షన్‌ రూపంలో వచ్చేది. అయితే ఇక్కడ పెన్షన్ మొత్తం తగ్గుతుంది. ఉదాహరణకు మీకు నెలకు రూ.35,000 పెన్షన్ వస్తోందనుకుంటే.. కమ్యూటేషన్ ఆప్షన్ ఎంచుకుంటే మీకు రూ.29,000 పెన్షన్ వస్తుంది. ఇప్పుడు కొత్త ప్రతిపాదనకు ఆమోదం వల్ల పెన్షన్‌ పూర్తి విలువను 15 ఏళ్ల తర్వాత పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే 15 ఏళ్ల తర్వాత మళ్లీ పూర్తి పెన్షన్ పొందొచ్చు. సెప్టెంబర్ 25, 2008లోగా కమ్యూటేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నవారికి పూర్తి స్థాయిలో పెన్షన్ అందజేయాలని EPFO సూచనను కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 20న నోటిఫై చేసింది. దీంతో EPFO కింద నడిచే ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్‌లో సవరణలు జరిగాయి.

Image result for పెన్షన్ కమ్యూటేషన్

15 ఏళ్ల తర్వాత కూడా పూర్తి స్థాయిలో పెన్షన్లు వస్తాయని పేర్కొంటూ అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడంతో 6.3 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. ఇకపోతే పెన్షన్ కమ్యుటేషన్ పునరుద్ధరణ అంశానికి EPFO గత ఏడాదిలోనే ఆమోందం తెలిపింది. 2019 ఆగస్ట్ 21న జరిగిన సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీ మీటింగ్‌లో EPFO దీనికి ఓకే చెప్పింది. కాగా EPFO 2009లో పెన్షన్ కమ్యుటేషన్ ఫెసిలిటీని ఉపసంహరించింది. దీంతో దీని కన్నా ముందు పదవీ విరమణ చేసి కమ్యుటేషన్ ఆప్షన్ ఎంచుకున్న వారిపై ప్రతికూల ప్రభావం పడింది. దాంతో ఎంప్లాయిమెంట్ పెన్షన్ స్కీమ్ 1995 చట్టంలో సవరణలు చేయాల్సిందిగా EPFO సూచనలు చేసింది. దాంతో ఇప్పుడు మళ్లీ కేంద్ర ప్రభుత్వం వీరికి తీపికబురు అందించింది. పెన్షన్ కమ్యుటేషన్ బెనిఫిట్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది కొన్ని ప్రభుత్వ శాఖల్లో ఇంకా అమలవుతోంది.

Content above bottom navigation