పేద బ్రాహ్మణులకు జగన్ గుడ్ న్యూస్.. రూ. 15,000 సాయం..

125

సంచలనాలకు కేంద్ర బిందువు అయినా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రజలకు వరాల మీద వరాలు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రుణాలు, పెన్షన్స్, ఇళ్ల పంపిణి లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజలకు దగ్గర అవుతున్నాడు. అలాగే ఆ కులం, ఈ కులం అనే తేడా లేకుండా ప్రతి ఒక్క కులం వారికి ప్రత్యేకంగా పథకాలు తీసుకొస్తూ ఆదుకుంటున్నారు. సీఎం జగన్ అన్ని వర్గాలపైనా ప్రేమ కురిపిస్తూ సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి రాయితీలు, సంక్షేమ పథకాలు అందుకోని, అగ్రకులస్తుల కోసం కూడా ఆయన వినూత్న పథకాలు ప్రకటిస్తున్నారు. నాయీ బ్రాహ్మణులు, రజకులు, దర్జీలకు ఇంతకముందు వరాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.

తాజాగా జగన్మోహన్‌ రెడ్డి మరో నూతన పథకానికి శ్రీకారం చుట్టారు. బ్రాహ్మణుల కోసం ఓ ప్రత్యేక సంక్షేమ పథకాన్ని రూపొందించారు. పేద బ్రాహ్మణ కుటుంబాల్లో ఉపనయనం చేసుకోవడానికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేసే నూతన పథకాన్ని ప్రవేశపెట్టాలని ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ కార్పొరేషన్‌ నిర్ణయించింది. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే కొత్త ఆర్థిక సంవత్సరంలో ఈ పథకాన్ని ప్రారంభించడానికి కసరత్తు జరుగుతోంది. 7–16 ఏళ్ల మధ్య వయసున్న పేద బ్రాహ్మణులు ఉపనయనం చేసుకుంటే ఈ ఆర్థిక సాయం అందజేస్తారు. మరోవైపు విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించే బ్రాహ్మణ యువతకు ‘భారతి’ పథకంలో భాగంగా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేయడానికి బ్రాహ్మణ కార్పొరేషన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

Image result for బ్రాహ్మణులకు జగన్

ఫిబ్రవరి 29వ తేదీ వరకు కార్పొరేషన్‌ వెబ్‌పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏడాదికి రూ.6 లక్షల లోపు కుటుంబ ఆదాయం ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. ఈ పథకంలో ఒక విడత ఆర్థిక సహాయం పొందిన వారు అనర్హులు. కనీసం ఏడాది కాలం మాస్టర్స్‌ డిగ్రీ చదవడానికి విదేశీ యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్రాహ్మణ కార్పొరేషన్‌ ద్వారా రూ.100 కోట్లతో వివిధ పథకాలు అమలవుతున్నాయని, 15 వేల మంది బ్రాహ్మణులకు ప్రతి నెలా పింఛను ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వేదవ్యాస, గాయత్రి, కల్యాణమస్తు, గరుడ, భారతి తదితర పథకాల కింద ఇప్పటిదాకా 22,056 మంది లబ్ధిదారులను గుర్తించారు. వారందరికీ త్వరలో ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు చేపట్టారు. వాస్తవానికి పేదరికానికి కులంతో పనేముంది.. పేదరికంలో ఉంటే అగ్రకులస్తులు మాత్రం ఇబ్బందులు పడటం లేదా. అందుకే ఇలాంటి పథకాలు వారికి ఊరటనిస్తాయనడంలో సందేహం లేదు.

Content above bottom navigation