పోస్టాఫీస్ కొత్త స్కీమ్… కేవలం 1.5 లక్షలు పెడితే రూ. 44 లక్షలు వస్తుంది

డబ్బు ఆదా చేసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీకు బ్యాంకుల కన్నా పోస్టాఫీస్‌లు బెస్ట్. పోస్టాఫీస్‌లు వివిధ రకాల సేవింగ్ స్కీమ్స్‌ను అందిస్తున్నాయి. వీటిల్లో డబ్బు ఇన్వెస్ట్ చేస్తే అదిరిపోయే రాబడితోపాటు పన్ను ప్రయోజనాలు పొందొచ్చు. పోస్టాఫీస్ లో స్మాల్ సేవింగ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్‌ చాలానే ఉన్నాయి. వీటిల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) కూడా ఒకటి. తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌ తోనే ఈ పథకంలో చేరొచ్చు. పన్ను ప్రయోజనాలు పొందొచ్చు. సెక్షన్ 80 సీ కింద డిపాజిట్ చేసిన మొత్తం, దీనిపై వచ్చిన వడ్డీ రేటు, విత్‌డ్రా చేసుకునే మొత్తంపై ఎలాంటి పన్ను ఉండదు. రూ.500 నుంచి డిపాజిట్ చేయవచ్చు. ఎవరైనా ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్‌ను తెరవొచ్చు. పిల్లల పేరుపై కూడా పీపీఎఫ్ ఖాతా ఓపెన్ చేయవచ్చు. కనీసం రూ.500 ఇన్వెస్ట్ చేయాలి. గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. మీరు నెలకు 1.5 లక్షలు కడితే 15 ఏళ్లలో మీకు 44 లక్షలు వస్తాయి.

అయితే ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. పీపీఎఫ్ అకౌంట్‌ను ఇద్దరు కలిసి జాయింట్‌గా ఓపెన్ చేయడానికి వీలులేదు. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ లేదా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ కలిగిన వారు కూడా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌ ఖాతాను తెరవొచ్చు. ఒక వ్యక్తి ఒక అకౌంట్‌ను మాత్రమే కలిగి ఉండాలి. బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌కు వెళ్లి పీపీఎఫ్ ఖాతాను తెరవొచ్చు.పీపీఎఫ్ అకౌంట్‌పై ప్రస్తుతం 7.9 శాతం వడ్డీ రేట్లు లభిస్తోంది. ఈ పీపీఎఫ్ అకౌంట్ మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు. అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్‌ లో డబ్బులు తీసుకోవాలంటే 15 ఏళ్లు ఆగాల్సిందే. ఒకవేళ మీరు 15 ఏళ్ల దాటిన తర్వాత కూడా ఖాతాను కొనసాగించాలని భావిస్తే.. మరో ఐదేళ్లపాటు పొడిగించుకోవచ్చు. దీనికి ఫామ్ హెచ్ అందించాల్సి ఉంటుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్‌ను ఒక పోస్టాఫీస్ నుంచి మరో పోస్టాఫీస్‌ కు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. పీపీఎఫ్ ఖాతాలోని డబ్బులను ముందుగా కూడా తీసుకోవచ్చు. అకౌంట్ ప్రారంభించి కనీసం ఐదేళ్లు అయితేనే ఈ ప్రయోజనం పొందొచ్చు. ఇక మొత్తం డబ్బును ఒకేసారి తీసుకోలేం. ముందు ఏడాది వరకు క్రెడిట్ అయిన డబ్బులో 50 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు.

Image result for post office ppf scheme

ఇక పోస్టాఫీస్ PPF స్కీమ్ కు కావాల్సిన డాక్యుమెంట్స్ విషయానికి వస్తే… ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్ పోర్ట్….వీటిలో ఏదో ఒకటి కావాలి. అలాగే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు, ఫామిలీ ఇన్కమ్ సర్టిఫికెట్, పోస్టాఫీస్ అకౌంట్ బుక్ ఉండాలి. అలాగే 2 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు కావాలి. ఇక ఈ స్కీమ్ ఎలా అప్లై చేసుకోవాలి అంటే… మీరు పోస్టాఫీస్ కు వెళ్లి అక్కడ అప్లై చేసుకోవచ్చు. పోస్టాఫీస్ లో PPF కి సంబందించినా ఒక ఫార్మ్ ఇస్తారు. ఆ ఫార్మ్ ను ఫీల్ చేసి, మీ డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి మీరు ఏ స్కీమ్ కు అప్లై చేసుకోవచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్‌ను ఒక వ్యక్తి పేరుపై నుంచి మరొకరి పేరుపైకి మార్చుకోవడానికి కుదరదు. పీపీఎఫ్ అకౌంట్ కలిగిన వ్యక్తి ఒకవేళ మరణిస్తే.. అప్పుడు కూడా ఇదే వర్తిస్తుంది. అంటే అకౌంట్ నామినీ పీపీఎఫ్ ఖాతాను కొనసాగించలేరు. మెచ్యూరిటీ వరకు పీపీఎఫ్ అకౌంట్‌లోని డబ్బులపై వడ్డీ వస్తూనే ఉంటుంది. ఇలా ఈ స్కీమ్ వలన అనేక బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి వెంటనే పోస్టాఫీస్ కు వెళ్లి PPF స్కీమ్ లో జాయిన్ అవ్వండి.

Content above bottom navigation