మార్చి 31 లోపు ఈ 6 పనులు పూర్తీ చెయ్యండి..

138

మార్చి 31 వస్తుంది. ఈ ఇయర్ ఆర్థిక సంవత్సరానికి ఇదే చివరి రోజు. ఆర్థిక సంవత్సరం ప్రతీ ఏడాది ఏప్రిల్ 1న ప్రారంభమై మరుసటి ఏడాది మార్చి 31న ముగుస్తుంది. 2019-20 ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకొన్ని రోజులే ఉంది. ఆర్థిక లావాదేవీలు జరిపేవారికి మార్చి 31 చాలా ఇంపార్టెంట్ డే. ఆ రోజులోగా పూర్తి చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. చాలా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్‌ కు, ఆర్థిక పరమైన అంశాలకు మార్చి 31 చివరి రోజు. మరి ఈ ఏడాది మార్చి 31 లోగా పూర్తి చేయాల్సిన 6 ముఖ్యమైన పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

  1. ప్రధాన మంత్రి వయవందన యోజన-PMVVY పెన్షన్ స్కీమ్‌లో చేరడానికి 2020 మార్చి 31 చివరి తేదీ. ఎక్కువ వడ్డీతో పాటు వృద్ధాప్యంలో నెలకు రూ.10,000 వరకు పెన్షన్ ఇచ్చే స్కీమ్ ఇది. ప్రధాన మంత్రి వయ వందన యోజన… కేంద్ర ప్రభుత్వం 2017లో ప్రారంభించిన పెన్షన్ స్కీమ్ ఇది. ఈ పెన్షన్ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే నెలకు రూ.1,000 నుంచి రూ.10,000 వరకు పెన్షన్ పొందొచ్చు. పెన్షన్ ఎంత తీసుకోవాలి అనేదానిపై మీ పెట్టుబడి ఆధారపడి ఉంటుంది.
Image result for మార్చి 31 లోపు ఈ 6 పనులు పూర్తీ చెయ్యండి..
  1. పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేయాలంటూ ఆదాయపు పన్ను శాఖ చాలాకాలంగా కోరుతోంది. ఇప్పటికే 10 సార్లు గడువు పెంచింది. ప్రస్తుతం 2020 మార్చి 31 వరకు గడువు విధించింది. ఈసారి గడువు పెంచే అవకాశం లేదు. అందుకే మీ పాన్ నెంబర్‌ను, ఆధార్ నెంబర్‌ను మార్చి 31 లోగా లింక్ చేయాల్సిందే. లేకపోతే ఆ తర్వాత మీ పాన్ కార్డ్ చెల్లదు. రూ.10,000 జరిమానా చెల్లించే పరిస్థితి రావొచ్చు. ఒకవేళ మీరు గతంలోనే పాన్-ఆధార్ లింక్ చేసినట్టైతే స్టేటస్ ఓసారి చెక్ చేసుకోవడం మంచిది. ఆఫ్ లైన్ లో, ఆన్ లైన్ లో మీరు పాన్ నెంబర్ ఆధార్ నెంబర్ లింక్ చేయొచ్చు.
  1. మొదటి సారి ఇల్లు కొనేవారు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన – అర్బన్ స్కీమ్‌కు అర్హులు. క్రెడిట్ లింక్డ్ ఇంట్రెస్ట్ సబ్సిడీ పొందొచ్చు. ఎంఐజీ 1, ఎంఐజీ 2 కేటగిరీలో రూ.235000 వరకు వడ్డీపై సబ్సిడీ పొందొచ్చు. ఎంఐజీ 1, ఎంఐజీ 2 కేటగిరీవాళ్లు ఈ బెనిఫిట్ పొందాలంటే 2020 మార్చి 31 చివరి తేదీ. ఎకనమికల్లీ వీకర్స్ సెక్షన్-EWS, ఎల్ఐజీ కేటగిరీ వాళ్లకు 2022 మార్చి 31 వరకు అవకాశముంది.
  2. 2018-19 ఆర్థిక సంవత్సరం అంటే 2019 – 20 అసెస్‌మెంట్ ఇయర్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి మార్చి 31 చివరి తేదీ. వాస్తవానికి 2019 జూలై 31న గడువు ముగిసింది. కానీ ఆదాయపు పన్ను శాఖ ఓ నెల గడువు పొడిగించింది. మరోసారి 2019 డిసెంబర్ 31 వరకు గడువు పెంచింది. అయితే పెనాల్టీతో 2019-20 అసెస్‌మెంట్ ఇయర్ ట్యాక్స్ రిటర్న్ మార్చి 31 వరకు ఫైల్ చేయొచ్చు. ఒకవేళ మీ ఆదాయం రూ.5 లక్షల లోపు అయితే రూ.1000, ఆదాయం రూ.5 లక్షల కన్నా ఎక్కువైతే రూ.10,000 జరిమానా చెల్లించాలి. ఒకవేళ మీ ఐటీఆర్‌లో ఏవైనా లోపాలు ఉంటే రివైజ్డ్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి కూడా మార్చి 31 లాస్ట్ డేట్.
  1. ఇక 2019-20 ఆర్థిక సంవత్సరంలో మీ వార్షికాదాయం పన్ను పరిధిలోకి వస్తుందా? అయితే పన్ను తగ్గించుకునేందుకు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే మార్చి 31 చివరి తేదీ. 80 సీ సెక్షన్ ద్వారా రూ.1.5 లక్షల వరకు బెనిఫిట్ పొందొచ్చు. అయినా పన్ను కట్టాల్సి వస్తున్నట్టైతే నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసి సెక్షన్ 80సీసీడీ కింద రూ.50,000 వరకు మినహాయింపు పొందొచ్చు. మెడికల్ ఇన్స్యూరెన్స్ తీసుకొని రూ.50,000 వరకు మినహాయింపు పొందొచ్చు.
  2. మీ ఈక్విటీ పెట్టుబడులపై లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్-LTCG ట్యాక్స్ బుక్ చేయాలనుకుంటే 2020 మార్చి 31 వరకే అవకాశం ఉంటుంది. రూ.1,00,000 వరకు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. దీని వల్ల 10% పన్ను తప్పించుకోవచ్చు.

ఇవేనండి మీరు మార్చి 31 లోపు కంప్లీట్ చెయ్యాల్సిన పనులు. కాబట్టి ప్రతి ఒక్కరి ఈ మార్చి 31 లోపు ఈ పనులు కంప్లీట్ చెయ్యండి.

Content above bottom navigation