మీకు తెలియని ఈ విషయాలను మీ స్మార్ట్‌ ఫోన్ చేసి చూపిస్తుంది..

1608

ఇప్పుడు ఉన్నది స్మార్ట్ ఫోన్ల కాలం. స్కూల్ పిల్లాడి నుంచి సీనియర్ సిటిజన్ వరకు అందరి చేతుల్లోకి మొబైల్స్ వచ్చేశాయి. ముఖ్యంగా యువత ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి పడుకోబోయే వరకు అంతా ‘స్మార్ట్‌’ గా గడిపేస్తోంది. ఓ అవసరంగా మన జీవితాల్లోకి వచ్చిన ఈ ఫోన్లు.. తర్వాత మన జీవితంలో ఓ భాగమైపోయాయి. స్మార్ట్ ఫోన్ తో అనేక పనులు క్షణాల్లో జరిగిపోతున్నాయి. కొన్ని అత్యవసర పనులు అయితే కేవలం ఫోన్ ద్వారానే సాధ్యమవుతున్నాయి. అయితే మీరు చేయలేని పనులను కూడా మీ స్మార్ట్ ఫోన్ చేస్తుందని మీకు తెలుసా. ఇది కొంచెం ఆశ్చర్యం కలిగించినా కూడా ఇది నిజం. మీరు చేయలేని, మీకు తెలియని పనులను మీ స్మార్ట్ ఫోన్ ఎలా చేస్తుందో ఇప్పుడు చూద్దాం.

 • మీరు స్మార్ట్ ఫోన్ కొన్న తరువాత మీరు న్యూస్ అప్ డేట్స్ పొందవచ్చు. కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మీరు వెదర్, న్యూస్ లాంటి విషయాలను తెలుసుకోవచ్చు.
 • మీరు ఎప్పటికప్పుడు మీ హార్ట్ బీట్ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడొస్తున్న అన్ని స్మార్ట్ ఫోన్లలో ఈ ఫీచర్ ఆటోమేటిగ్గా వస్తోంది. ఆస్పత్రికి వెళ్లకుండా మీరు చెక్ చేసుకోవచ్చు.
 • మీరు ఎప్పటికప్పుడు విమాన ప్రయాణ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. కొన్ని యాప్స్ మీ ఫోన్లో ఇన్ స్టాల్ చేసుకోవడం వల్ల మీరు ఇవి చేయవచ్చు.
 • ఈ మధ్య చాలా కంపెనీలు ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లతో ఫోన్లను అందిస్తున్నాయి. కాబట్టి మీకు ఛార్జింగ్ అయిపోతుందన్న దిగులే ఉండదు.
 • మీ స్మార్ట్ ఫోన్ తో కారు స్టార్టింగ్ చేసే టెక్నాలజీ కూడా వచ్చేసింది. మీరు ఎప్పుడైనా కారు కీస్ మర్చిపోయినా, లేకుంటే పోగొట్టుకున్నా మీ స్మార్ట్ ఫోన్ చాలా సహయం చేస్తుంది.
 • మీ ఫోన్ లో ఒకేసారి మల్టిపుల్ యాప్స్ ని క్లోజ్ చేయవచ్చు. మీరు ఎన్ని యాప్స్ ఓపెన్ చేసినా వెంటనే క్లోజ్ అయిపోతాయి.
 • మీ బ్లడ్ లో ఆల్కాహాల్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. కొన్ని రిలేటెడ్ యాప్స్ మీరు ఇన్ స్టాల్ చేసుకోవడం వల్ల మీరు ఈ సదుపాయాన్ని పొందవచ్చు.
 • మీరు ఎక్కువ సమయం నిద్రపోవాలనుకుంటున్నారా. అయితే మీరు కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటే, అవి సుఖవంతంగా నిద్రను పట్టేలా చేస్తాయి. లైటింగ్ ను మీ నిద్రకు అనుకూలంగా మార్చి మిమ్మల్ని హాయిగా నిద్రపోయేలా చేస్తాయి.
Image result for మీకు తెలియని ఈ విషయాలను మీ స్మార్ట్‌ ఫోన్ చేసి చూపిస్తుంది.. tech
 • మీరు మీ ఫోన్ తో అనేక రకాలైన ఎమోజీలను అలాగే టెక్ట్స్ ను క్రియేట్ చేసుకోవచ్చు. మీరు షార్ట్ కట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు.
 • మీరు చీకటిలో ప్రయాణిస్తున్న సమయంలో మీరు మీ ఫోన్ ని టార్చిలైటుగా ఉపయోగించుకోవచ్చు. ఈ ఫీచర్ ప్రతి ఫోన్ లో ఉంటుంది.
 • మీరు ఏకాంతంగా కొన్ని భయంకరమైన రోడ్లలో ప్రయాణిస్తన్నప్పుడు, మీకు అక్కడ ఏదైనా జరిగితే, వెంటనే అలర్ట్ చేసేందుకు ఫోన్ కాల్స్ టెక్ట్స్ పంపుకునే అవకాశం ఉంది. దాంతో మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.
 • మీరు మీ ఫోన్ ని టీవీగా కూడా వాడుకోవచ్చు. అందులో ఎన్నోరకాలైన సినిమాలు, ప్రపంచవ్యాప్తంగా జరిగే విషయాలు తెలుసుకోవచ్చు.
 • మీ ఫోన్ ను రిమోట్ గా వాడుకోవచ్చు. మీరు ఏదైనా షోని ఆసక్తికరంగా చూస్తున్నప్పుడు మధ్యలో రిమోట్ వాడుతున్నారనుకోండి. అందులో బ్యాటరీ పనిచేయకుంటే వెంటనే మీ మొబైల్ తో దాన్ని ఆపరేట్ చేయవచ్చు. దీనికోసం కొన్ని యాప్స్ ఉన్నాయి.
 • మీరు జర్నీలో ఉన్నప్పుడు మీ కారుకు ఏదైనా ప్రాబ్లం వస్తే, మీరు వెంటనే మీ మొబైల్ తో తెలుసుకోవచ్చు. అలాగే మెకానిక్ ని పిలుచుకోవచ్చు.
 • మీ ఫోన్ తో ఏ ఫోటోనైనా క్షణాల్లో గూగుల్ ద్వారా వెతుక్కోవచ్చు. అలాగే వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఇలా ఎన్నో మనం చెయ్యలేని విషయాలను మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ చేస్తుంది. అయితే ఈ మద్య స్మార్ట్ ఫోన్ కు ఎక్కువగా బానిస అయ్యి జీవితాలను నాశనం చేసుకుంటున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. అలా కాకుండా అవసరం ఉన్నంతవరకే దీనిని యూజ్ చేసుకోండి.

Content above bottom navigation