మీ ఇంటి మహాలక్ష్మి కోసం తీసుకున్న పథకంలో ఈ మార్పులు గమనించారా?

బాలికల సంక్షేమానికి, ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ఆర్థికంగా భరోసా కల్పించడానికి కేంద్రం ప్రవేశపెట్టిన పథకమే ‘సుకన్య సమృద్ధి యోజన’. ‘భేటీ బచావో భేటీ పడావో’ నినాదాన్ని వినిపిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2015లో ప్రారంభించింది. పదేళ్ల లోపు ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఈ ఖాతాను తెరవచ్చు. సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లను దేశంలోని అన్ని ప్రముఖ బ్యాంకులతో పాటు పోస్ట్‌ ఆఫీసుల్లో తెరవచ్చు. ఈ పథకానికి ఎంతగానమో ప్రాచుర్యం ఉంది.. అయితే ఈ పథకంలో కొన్ని మార్పులు చేశారు. ఈ మేరకు ఆర్ధిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దానికి సంబంధించి పూర్తీ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

  • సుకన్య సమృద్ధి యోజన పథకంలో భాగంగా ఒక ఆర్ధిక సంవత్సరంలో ఖాతాలో కనీసం రూ. 250 జమ చేయాలన్న విషయం తెలిసిందే. అయితే ఈ కనీస మొత్తాన్ని కూడా జమచేయకుంటే దాన్ని డిఫాల్ట్ అకౌంట్ గా పరిగణిస్తారు. కొత్తగా వచ్చిన రూల్స్ ప్రకారం ఇలాంటి డిఫాల్ట్ అకౌంట్స్ పై కూడా ఈ పథకంలో పేర్కొన్న వడ్డి రేటును చెల్లిస్తారు. మెచ్యూరిటీ వరకు అకౌంట్ ను క్రమబద్దీకరించకున్నా ఈ వడ్డీ రేటు అందుతుంది. పాత రూల్స్ ప్రకారం ఇలాంటి ఖాతాలపై పోస్టాఫీసు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ వడ్డీ రేటును చెల్లించే వారు. ఈ అకౌంట్ పై వడ్డీ రేటు ప్రస్తుతం 4 శాతంగా ఉంది. సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ పై ప్రస్తుతం వడ్డీ రేటు 8.7 శాతం ఉన్నది. పాపకు నామినీగా ఉన్న వారు మరణించినప్పుడు ఆ అకౌంట్ డిఫాల్ట్ అకౌంట్ గా మారే అవకాశం ఉంటుంది.
  • ఈ పథకంలోని కొత్త రూల్స్ ప్రకారం పాప చనిపోయిన సందర్భంలో లేదా ప్రాణాంతక వ్యాధుల చికిత్సలకు లేదా నామినీ చనిపోయినప్పుడు అకౌంట్ ను క్లోజ్ చేయవచ్చు. ఇంతకు ముందు రూల్ ప్రకారం పాప మరణించినప్పుడు, లేదా పాప నివాస స్థాయి మారినప్పుడు ఖాతాను క్లోజ్ చేసుకోవడానికి అనుమతి ఉంది. అయితే కొత్త నిబంధనల్లో ముందే క్లోజ్ చేసుకోవచ్చా లేదా మెచ్యూరిటీ వరకు కొనసాగించాలా అన్న విషయాన్నీ స్పష్టంగా చెప్పలేదు.
  • కొత్త నిబంధనల ప్రకారం.. 18 ఏళ్ల వయసు వచ్చే వరకు బాలిక అకౌంట్ ను నిర్వహించడానికి వీలులేదు. పాత నిబంధనల ప్రకారం ఇది పదేళ్లు గా ఉంది. 18 ఏళ్ళు వచ్చే వరకు అకౌంట్ ను సంరక్షకుడు నిర్వహిస్తారు. 18 ఏళ్ళు నిండిన తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్ ను అకౌంట్ ఉన్న బ్యాంకు లేదా పోస్టాఫీసుకు సమర్పించాలి.
Image result for ఇంటి మహాలక్ష్మి కోసం తీసుకున్న పథకంలో ఈ మార్పులు గమనించారా?
  • ఇద్దరికన్నా ఎక్కువ ఆడపిల్లలు ఉన్న సందర్భంలో అకౌంట్ ను ప్రారంభించడానికి అదనంగా డాక్యుమెంటేషన్ అవసరం ఉంటుంది. పుట్టిన తేదీ సర్టిఫికెట్ తో పాటు అఫిడవిట్ ను కూడా సమర్పించాల్సి ఉంటుంది. పాత రూల్స్ ప్రకారం మెడికల్ సర్టిఫికెట్ సమర్పిస్తే సరిపోయేది. సాధారణంగా ఒక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలు అకౌంట్ ను తెరవచ్చు. అయితే కవలలు లేదా ముగ్గురు ఆడపిల్లలు ఒకేసారి పుట్టిన సందర్భంలో ఎక్కువ అకౌంట్స్ ను ప్రారంభించాల్సి ఉంటుంది. ఒకేసారి ముగ్గురు పిల్లలు జన్మించినా లేదా రెండో కాన్పులో ఇద్దరు ఆడపిల్లలు జన్మించినా మూడో అకౌంట్ అవసరం ఏర్పడుతుంది.

ఇలా సుకన్య సమృద్ధి యోజన పథకంలో కొన్ని మార్పులు చేశారు. కాబట్టి ఈ అకౌంట్ ఉన్నవాళ్లు, లేదా కొత్తగా ఈ పథకంలో జాయిన్ అవ్వాలనుకునేవారు ఈ విషయాలు గుర్తుకుపెట్టుకోండి.

Content above bottom navigation