మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేదా… అయితే పెద్ద శుభవార్త…

208

ఈ మధ్యకాలంలో చాలామంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే వాహనం నడుపుతున్నారు. ఇక అదే సమయంలో పోలీసులకు కూడా దొరికిపోతుంటే వేలల్లో ఫైన్లు కట్టాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే వాటి నుంచి తప్పించుకోవడానికి కొన్నిసార్లు వాహనదారులు ప్రమాదాలకు కూడా గురవుతుంటారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు లైసెన్స్ అప్లై చేసుకునే ప్రతీసారి.. మొదట లెర్నింగ్ లైసెన్స్‌ను ఇచ్చి.. ఆ తర్వాత రెన్యూవల్ లైసెన్స్ ఇచ్చేవారు. అంతేకాకుండా ఆ రెండింటికీ కూడా వేర్వేరు అప్లికేషన్ ఫామ్స్‌ను పూర్తి చేయాల్సి ఉండేది. అయితే ఇకపై ఆ రెండు లైసెన్స్‌లకు కలిపి ఒకే అప్లికేషన్ ఫామ్‌ను ఇచ్చేలా రవాణా శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.

అంతేకాకుండా ఇకనుంచి లైసెన్స్ ను మీరు ఒక గంటలో అప్లై చేసుకోవచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న లింక్ ను ఓపెన్ చేసి మీరు ఆన్ లైన్ లో డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు. https://parivahan.gov.in/parivahan/
ఇది RTO వాళ్ళ అఫీషియల్ వెబ్ సైట్. మీరు ఎలాంటి మీడియేటర్స్ అవసరం లేకుండా డైరెక్ట్ గా ఈ లింక్ లోకి వెళ్లి లైసెన్స్ అప్లై చేసుకోవచ్చు. ఇందులో మీ డీటెయిల్స్ అడుగుతుంది. మీ డీటెయిల్స్ ఫిల్ చేసి, 200 రూపాయలు పే చేసి మీరు డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోవచ్చు. ఇలా అప్లై చేసిన తర్వాత మిమ్మల్ని టెస్టింగ్ కోసం పిలుస్తారు. అలా డ్రైవింగ్ టెస్ట్ తర్వాత ఒక 10 రోజుల్లో మీకు డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది.

మరోవైపు రోడ్డు యాక్సిడెంట్లు తగ్గించడానికి కేంద్రం ఇప్పటికే రూల్స్‌ను కఠినతరం చేయడమే కాకుండా బండి నడిపేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. కాగా, లైసెన్స్ పొందేందుకు కనీస అర్హతను 8వ తరగతికి తగ్గించిన సంగతి విదితమే. ఇక ఒరిజినల్ లైసెన్స్ పొగొట్టుకున్నా, మీ రూపురేఖల్లో మార్పులు వచ్చి కొత్త ఫొటోతో అప్ డేట్ చేసుకోవాలన్నా, లేక కార్డు దెబ్బతిన్నా కొత్త లైసెన్స్ కార్డు తీసుకోవచ్చు. ఇందుకోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి సంబంధిత కౌంటర్ లో LLD ఫామ్ సమర్పించాలి. దానితో పాటు అడ్రెస్ డాక్యుమెంట్, ఒక పాస్ పోర్ట్ సైజు ఫొటో, దెబ్బతిన్న కార్డును వారికి చూపించి, ఫీజు చెల్లించిన తర్వాత, వేరొక కౌంటర్ లో వేలి ముద్రలు, ఫొటో తీసుకున్న తరువాత వారు కొత్త లైసెన్స్ జారీ చేస్తారు.

Image result for మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేదా… అయితే పెద్ద శుభవార్త…

అలాగే లైసెన్స్ టైమ్ పీరియడ్ ముగుస్తున్న క్రమంలో దాన్ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం RTO ఆఫీస్ కు వెళ్లి ఫామ్ 9 సమర్పించాలి. అలాగే శారీరక సామర్థ్యాన్ని తెలియజేస్తూ ఫామ్ 1, 50 ఏళ్లు దాటిన వారు, వాణిజ్య వాహనాల లైసెన్స్ దారులు ఫామ్ 1ఏ, ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ కార్డు, రెండు పాస్ పోర్ట్ సైజు ఫొటోలను కౌంటర్ లో సమర్పించాల్సి ఉంటుంది. ఫీజు కూడా చెల్లించాలి. కార్డు గడువు తీరి పోయిన 5 ఏళ్ల తర్వాత దరఖాస్తు చేసుకుంటే మాత్రం తిరిగి మళ్లీ డ్రైవింగ్ టెస్ట్ లో పాసవ్వాలి.

Content above bottom navigation