మీ రేషన్ కార్డు ప్రింటింగ్ అయిందా లేదా ఇలా తెలుసుకోండి.

254

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… ఏం చెప్పిందో… అదే చేసుకుంటూ పోతోంది. ఇంటింటికీ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టింది. ఆయా జిల్లాల్లో నేతలు దీన్ని ప్రారంభించి గ్రామ, వార్డు వాలంటీర్లతో ప్రతీ ఇంటి తలుపు తట్టి రేషన్ కార్డులు ఇస్తున్నారు. ఈ కార్యక్రమం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తి చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే ఈ కార్డుల ద్వారా ప్రభుత్వం నాణ్యమైన బియ్యాన్ని ప్రజలకు ఇవ్వబోతోంది. అలాగే రేషన్ సరుకులు కూడా. ఇలా ఇళ్లకే తెచ్చి కార్డులు ఇస్తుండటంతో లబ్దిదారులు ఎంతో ఆనందపడుతున్నారు. ఇప్పుడు ఎవరైనా లబ్దిదారుల ఇంటికి గ్రామ వాలంటీర్లు రాకపోతే ఆందోళన చెందకుండా మరో వారం ఆగడం మంచిదే. ఎందుకంటే ప్రతి కార్డుపైనా తహశీల్దారు డిజిటల్‌ సంతకం తప్పనిసరి చేశారు. అందుకే కాస్త ఆలస్యమవుతోంది. వారమైనా కార్డు తెచ్చి ఇవ్వకపోతే, అప్పుడు కాల్ చేసి, తమకు ఇంకా కొత్త రేషన్ కార్డు రాలేదని అడగవచ్చు. వెంటనే వాళ్లు అలర్టై తెచ్చి ఇస్తారు. అయితే మీ కార్డును ప్రభుత్వం ప్రింటింగ్ కు పంపిందా? లేదా? మీరు రేషన్ కార్డులో కొత్త వారిని యాడ్ చేస్తే వాళ్ళు యాడ్ అయ్యారా లేదా? డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఉందా లేదా? ఎలా తెలుసుకోవాలి .అలాగే మీకు అర్హత ఉన్నా, రేషన్ కార్డు లేకపోతే ఏమి చెయ్యాలి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న లింక్ ను ఓపెన్ చెయ్యండి. http://www.aajtakjobs.com/2020/02/Ap-
ఈ లింక్ ను మేము డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చాము. కావాలంటే అక్కడ లింక్ ఓపెన్ చెయ్యండి. ఈ లింక్ ఓపెన్ చెయ్యగానే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ పాత రేషన్ కార్డు నెంబర్ లేదా మీ ఆధార్ కార్డు నెంబర్ ను సబ్మిట్ చెయ్యాలి. సబ్మిట్ చేశాక మీ రేషన్ కార్డుకు సంబందించిన పూర్తీ వివరాలు మీకు కనిపిస్తాయి. మీకు రైస్ కార్డు అప్రూవ్ అయ్యింది కానీ జెనరేట్ కాలేదని చూపిస్తుంది. అలాగే కింద అప్రూవ్ ఫర్ ప్రింటింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. అంటే ఇంకొన్ని రోజుల్లోనే ప్రింటింగ్ చేసి, గ్రామ వాలంటీర్లు వచ్చి మీకు ఇస్తారని అర్థం.

Image result for ap ration card

ఇక రేషన్ కార్డు లేనివారికి గవర్నమెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ కార్డు లేనివారు అప్లై చెయ్యడానికి ఎలాంటి లాస్ట్ డేట్ లేదని, ఎప్పుడైనా సరే అప్లై చేసుకోవచ్చని అధికారులు చెప్పారు. అలాగే మీకు అర్హత ఉండి, రేషన్ కార్డు లేకపోతే గ్రామ సచివాలయంలో అప్లై చేసుకోవాలని, అప్లై చేసుకున్న వారికీ రీ వెరిఫికేషన్ జరుగుతుందని, రీ వెరిఫికేషన్ జరిగిన తర్వాత అర్హులు అని తేలితే, కేవలం 5 రోజుల్లోనే మీకు రేషన్ కార్డు అందుతుందని అధికారులు వివరించారు. కాబట్టి మీకు అర్హత ఉండి కూడా రేషన్ కార్డు రాకపోతే గ్రామ సచివాలయానికి వెళ్లి అప్లై చేసుకోండి. ఇవేనండి రేషన్ కార్డుకు సంబంధించి గవర్నమెంట్ నుంచి వచ్చిన న్యూస్ లు. మరి రేషన్ కార్డుకు సంబంధించి మేము ఇచ్చిన ఈ సమాచారం మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.

Content above bottom navigation