రేషన్ కార్డులపై సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం..! ఏంటో తెలిస్తే చి బిత్తరపోతారు..

161

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మార్చి 5 నుండి కొత్త రేషన్‌ కార్డులను మంజూరు చేయనుంది. ఇప్పటికే అర్హులు అయినా వారి లిస్ట్ ను గ్రామ సచివాలయానికి పంపింది. ఈ లిస్ట్ ను ఇంకొక రెండు రోజుల్లో సచివాలయంలో పెట్టనున్నారు. రేషన్ కార్డు పొందాలంటే కొన్ని అర్హతలు తప్పకుండ ఉండాలని గవర్నమెంట్ చెప్పింది. వాటి కోసం కొన్ని నిబంధనలు ఇచ్చింది. గతంలో గ్రామీణ ప్రాంతంలో రూ.75 వేలు, పట్టణాల్లో రూ.1.25 లక్షల వార్షికాదాయం వుంటే కార్డు వచ్చేది. కానీ తాజా నిబంధన మేరకు గ్రామాల్లో నెలకు రూ.పది వేలు, పట్టణాల్లో రూ.12 వేల ఆదాయం ఉన్న వారికీ రేషన్ కార్డు వర్తించేలా సవరించారు. అలాగే మూడెకరాల మాగాణి లేదా పదెకరాలలోపు మెట్ట లేదా రెండూ కలిపి పదెకరాలు వున్నా కూడా అర్హులు అని గవర్నమెంట్ ప్రకటించింది. అలాగే గతంలో 250 యూనిట్స్ కంటే తక్కువ కరెంట్ వాడే వారే అర్హులు. దీనిని 300 యూనిట్స్ కు పెంచారు.. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌ తీసుకునేవారు అనర్హులు. అయితే పారిశుధ్య కార్మికులకు మాత్రం అర్హత కల్పించింది.. అలాగే ట్రాక్టర్లు, ఆటోలు, ట్యాక్సీలు నడిపేవారికి కూడా అర్హత కల్పించింది. ఇలా కొందరికే అర్హత కల్పించింది.

కొందరు రేషన్ కార్డు కావాలని తప్పుడు సమాచారం ఇస్తున్నారు. మీరు రేషన్ కార్డుకు అప్లై చేసే సమయంలో తప్పుడు సమాచారం కనుక ఇస్తే మీ రేషన్ కార్డు క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికే సర్వే పూర్తీ అయ్యింది. తెల్ల రేషన్‌ కార్డుకు అర్హులైన వారి జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇప్పటికే ప్రభుత్వం నోటీసు బోర్డుల్లో పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 1,47,23,567 తెల్ల రేషన్‌కార్డులు ఉన్నాయి. కానీ ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో బోగస్‌ కార్డులు, పావర్టీ రేఖకు పైన ఉండి, తెల్ల రేషన్‌ కార్డులు కలిగిన వారు ఇలా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇప్పటికే 19,23,567 రేషన్‌ కార్డులను ప్రభుత్వం రద్దు చేయనున్నట్లు తెలిసింది. దీనిలో భాగంగానే 1.28కోట్ల రేషన్‌ కార్డులకు మాత్రమే అర్హుల జాబితాను సచివాలయాలకు పంపింది.

Image result for రేషన్ కార్డులపై సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం

ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా రూపొందించిన చిరిగిపోయేందుకు ఆస్కారం లేని నాన్‌ టేరబుల్‌ 1.28కోట్ల కార్డులను ముఖ్యమంత్రి నిర్ధేశించిన మార్చి 4వ తేదీ నాటికి పంపిణీ చేయాలని పౌరసరఫరాలశాఖ అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. 1.47కోట్ల రేషన్‌ కార్డుల సంఖ్య మార్చి నాటికి గణనీయంగా తగ్గనుంది. కాబట్టి మీ పేరు లిస్ట్ లో లేకపోతే వెంటనే గ్రామా వాలంటీర్ ను కలవండి. అర్హుల జాబితాను జాయింట్ కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షిస్తుండడంతో ఎవరికీ అన్యాయం జరగదని అధికారులు పేర్కొన్నారు. అలాగే ఇప్పటివరకు బియ్యం కార్డు లేని 1.5 లక్షల మందికి గ్రామా సచివాలయాలలో కొత్తగా అప్లై చేసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బియ్యం కార్డుకు అర్హులై ఉంటె వెంటనే అప్లై చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ నిరంతర కొనసాగుతూనే ఉంటుంది. మీరు అప్లై చేసిన వెంటనే పరిశీలించి ఐదు రోజుల్లో మీకు బియ్యం కార్డు వచ్చేలా చేస్తారు అధికారులు. కాబట్టి బియ్యం కార్డు లేని వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి.

Content above bottom navigation