రేషన్ కార్డులపై సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే బిత్తరపోతారు

118

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం పేదల కోసం తెల్లరేషన్ కార్డును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అర్హత కలిగిన వారికే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని, అర్హత లేని వారి కార్డులకు తొలగిస్తామని ఆల్రెడీ చెప్పింది. ఇప్పుడు చెప్పినట్టే దాదాపు 20 లక్షల తెల్ల రేషన్ కార్డుల్ని రద్దు చేసేందుకు సిద్ధమైంది. అసలు ఏపీలో పేదవాళ్లు ఎవరు అన్న లెక్కలు వేసుకొని, ఆ ప్రకారం ఎవరికీ వైట్ రేషన్ కార్డులు ఉంచాలి, ఎవరికి తీసెయ్యాలి అన్న అంశాలపై అధికారులు లిస్టు రెడీ చేశారు. దాని ప్రకారం, ఏపీలో 1.8 లక్షల మంది తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉండేందుకు అర్హులు కాదని తేలింది. ఇంకా ఈ లిస్టులో మరికొంత మందిని చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 15 నుంచీ ప్రభుత్వం కొత్త బియ్యం కార్డుల్ని పంపిణీ చెయ్యబోతోంది. మార్చి నుంచీ ఆ కార్డుల్ని చూపిస్తేనే ఫ్రీ బియ్యం, సరుకులు ఇస్తారు. ఐతే మార్చిలోగా లబ్దిదారులకు బియ్యం కార్డులు రాకపోయినా, వాళ్ళ వేలి ముద్రల ఆధారంగా సరుకులు ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. నిజానికి ఇది ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు తీసుకున్నది. ఏపీలో చాలా మంది పేదలు కాకపోయినా, వైట్ రేషన్ కార్డులు కలిగివున్నారు. అలాంటి వాళ్లు లబ్ది పొందుతూ నిజమైన పేదలకు అన్యాయం చేస్తున్నారని భావిస్తున్న ప్రభుత్వం, ఈ అక్రమాలకు చెక్ పెడతామని అంటోంది.

Image result for ap white ration card jagan

బియ్యం కార్డులు ఎవరికి ఇస్తారు అంటే.. గ్రామాల్లో నెలకు రూ.10వేలు, పట్టణాల్లో నెలకు రూ.12వేలు కంటే తక్కువ ఆదాయం వచ్చే వారికి ఇస్తారు. స్వీపర్లు, పారిశుధ్య కార్మికులు, సఫాయి కర్మచారి వర్కర్లకు మాత్రం వాళ్లు ఎంత ఆదాయం పొందుతున్న వాళ్లకు బియ్యం కార్డులు ఇస్తారు. 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉంటే కార్డు ఇవ్వరు. ఇందులోనూ కొన్ని కండీషన్లు ఉన్నాయి. ఫోర్ వీలర్ ఉంటే ఇవ్వరు. ఐతే టాక్సీ, ఆటో, ట్రాక్టర్ ఉంటే వాళ్లకు ఇస్తారు. ఇళ్లలో కరెంటు నెలకు 300 యూనిట్లు దాటకూడదు. అప్పుడే బియ్యం కార్డు ఇస్తారు. ఈ కండీషన్లన్నీ గ్రామ, వార్డు వాలంటీర్లకు తెలుసు. వాళ్లను అడిగి పూర్తి వివరాలు లబ్దిదారులు తెలుసుకోవచ్చు.

Image result for ap white ration card

ప్రస్తుతానికి ఏపీలో 18.72 లక్షల కుటుంబాలు తెల్ల రేషన్ కార్డులకు అర్హులు కాదని ప్రభుత్వం అంటోంది. ఆ లెక్కన దాదాపు 50 లక్షల మందికి త్వరలో నెల నెలా బియ్యం, ఇతర సరుకుల పంపిణీ నిలిచిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతానికి ప్రభుత్వం పేదలకు రేషన్ ద్వారా బియ్యం, పంచదార, గోధుమలు, పామోలిన్, చిరుధాన్యాలు ఇస్తోంది. అనర్హులకు ఇక అవి ఇచ్చే అవకాశం ఉండదని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ఏపీలో 1,47,23,567 తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో దాదాపు 10 లక్షల మంది ప్రభుత్వం ఇస్తున్న బియ్యం తీసుకోవడానికీ, తినడానికీ ఇష్టపడట్లేదు. అవి లావుగా ఉన్నాయనీ, వండితే ముద్దలా అవుతున్నాయని లబ్దిదారులు చెబుతున్నారు. అందుకే ప్రభుత్వం నాణ్యమైన బియ్యం ఇవ్వాలని డిసైడైంది. అలా ఇచ్చే ముందు నిజమైన లబ్దిదారుల లెక్క తేల్చి, అప్పుడు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ప్రక్షాళన చెయ్యడం ద్వారా సరైన పాలన అందిస్తున్నట్లు అవుతుందని అధికారులు అంటున్నారు.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation