రైతులకు మోడీ గుడ్ న్యూస్.. పావలా వడ్డీకే రూ.3 లక్షల రుణం ..

దేశానికి వెన్నెముక రైతన్న. అందుకే అన్నదాతకు అండగా నిలుస్తున్నాయి మన కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు. అందులో భాగంగానే కిసాన్ సమ్మాన్ నిధి, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను ప్రవేశపెట్టి రైతులకు ఆర్థిక భరోసాను కల్పిస్తున్నాయి. తాజాగా మోదీ సర్కార్ రైతులకు ప్రయోజనం కలిగించే మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల కోసం కిసాన్ క్రెడిట్ కార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

అన్నదాతకు అండగా ఉండడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా 25 లక్షల కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు(కేసీసీ) ఇవ్వాలని కేంద్ర వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కింద రైతులకు ప్రయోజనం కలిగించేలా కీలక నిర్ణయం తీసుకుంది. కిసాన్ క్రెడిట్ కార్డులు అందజేయాలని భావిస్తుంది. పీఎం కిసాన్ స్కీమ్ కింద ప్రయోజనం పొందే ప్రతి ఒక్క రైతుకు ఈ కిసాన్ క్రెడిట్ కార్డులు ఇవ్వాలని కేంద్రం యోచిస్తోంది. ప్రధాని మోడీ ఉత్తరప్రదేశ్‌ లో ఇటీవల కిసాన్ క్రెడిట్ కార్డుల జారీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ఉన్న 25లక్షల మంది రైతులకు కార్డులు ఇవ్వాలని అనుకుంటుంది.

Image result for పావలా వడ్డీకే రూ.3 లక్షల రుణం

అసలు కిసాన్ క్రెడిట్ కార్డు ఏంటంటే.. ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, ఆర్థిక సంస్థల వలలో చిక్కి రైతులు ఇబ్బంది పడకుండా బ్యాంకుల ద్వారా రుణాలను ఇప్పించడం ఈ కార్డుల లక్ష్యం. ఈ కేసీసీ స్కీమ్ కింద అర్హులైన అన్నదాతకు 4 శాతం వడ్డీకే రుణాలు ఇస్తారు. అంటే పావలా వడ్డీ పడుతుంది. అయితే తీసుకున్న రుణాన్ని ఖచ్చితంగా చెల్లించాలి. లేదంటే 7 శాతం వడ్డీ పడుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు ప్రకారం.. తీసుకున్న రుణాన్ని కచ్చితంగా చెల్లిస్తే, అప్పుడు రైతులకు 4 శాతం వడ్డీకే రుణాలు లభిస్తాయి. లేదంటే 7 శాతం వడ్డీ పడుతుంది. కిసాన్ క్రెడిట్ కార్డుపై రూ.3 లక్షల వరకు అప్పు తీసుకోవచ్చు. రైతులు గతంలో తీసుకున్న అప్పు కరెక్ట్ టైమ్‌‍కి కడితే అప్పు మళ్లీ వస్తుంది. కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్న రైతులు ఎలాంటి తనఖా లేకుండా రూ.1.6 లక్షల వరకు అప్పు పొందవచ్చు. బ్యాంకులు రుణాలపై సాధారణ వడ్డీనే వసూలు చేస్తాయి. ఒకవేళ రైతులు తీసుకున్న రుణాన్ని చెల్లించకపోతే అప్పుడు కాంపౌండింగ్ వడ్డీ పడుతుంది. కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ కింద సులభంగా రుణాలు తీసుకోవడమే కాకుండా మరో బెనిఫిట్ కూడా పొందొచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా తీసుకున్న రుణంతో పంటకు క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కవరేజ్ కూడా లభిస్తుంది. కేసీసీ అకౌంట్‌లోని డబ్బులకు సేవింగ్స్ వడ్డీ రేటు వర్తిస్తుంది. కిసాన్ క్రెడిట్ కార్డుల కోసం బ్యాంకులకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ కూడా ఈ కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలను అందిస్తోంది. మీరు ఎస్‌బీఐకి వెళ్లి కూడా లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న లింక్‌పై క్లిక్ చేసి ఆన్‌లైన్‌లో అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకుని, అది ఫిల్ చేసి, ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్లను జతచేసి బ్యాంక్‌కు వెళ్లి సంబంధిత అధికారులకు అందజేయాల్సి ఉంటుంది.

https://www.pmkisan.gov.in/
Content above bottom navigation