రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న ఇండియన్ రైల్వే శాఖ..

91

మీకు రైల్వే ప్రయాణం ఎక్కువగా చేస్తుంటారా? అయితే రైల్వే శాఖా మీకొక గుడ్ న్యూస్ చెప్పింది. మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ట్రైన్ జర్నీ చేయడానికి ఇష్టపడతారు. బస్ చార్జీలతో పోలిస్తే ట్రైన్ టికెట్ ధర తక్కువగా ఉండటం, సౌకర్యవంతమైన ప్రయాణం వంటి పలు అంశాలు ఇందుకు ప్రధాన కారణం. అయితే ట్రైన్ టికెట్‌ ముందే బుక్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కొన్ని సందర్భాల్లో అనుకోకుండా ట్రైన్ జర్నీ చేయాల్సి రావొచ్చు. ఇలాంటప్పుడు తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలి. రైల్వే ప్రయాణానికి ఒక రోజు ముందు ఈ టికెట్‌ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణ టికెట్ బుకింగ్‌‌ కు చెల్లించే డబ్బుతో పోలిస్తే తత్కాల్‌ టికెట్‌ కు కొంత ఎక్కువ చార్జీ చెల్లించాలి. తత్కాల్ ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలంటే స్పీడ్‌ గా టైమ్‌ కు కరెక్ట్‌ గా ఉండాలి. లేదంటే టికెట్ దొరకదు. తత్కాల్ టికెట్లు కేవలం కొన్ని నిమిషాల్లోనే అయిపోతాయి. అంత డిమాండ్ ఉంటుంది. నెమ్మదిగా ఉంటే మాత్రం తత్కాల్ టికెట్ బుకింగ్ లభించవు.

ఇప్పుడు ఇండియన్ రైల్వే తత్కాల్ టికెట్ తీసుకునే ప్యాసింజర్లకు ఉపయోగపడే నిర్ణయం తీసుకున్నారు. చట్టవిరుద్దమైన సాఫ్ట్‌వేర్స్‌ ను తొలిగించారు. అలాగే ఏకంగా 60 మంది ఏజెంట్లను అరెస్ట్ కూడా చేశారు. వీరందరూ తత్కాల్ టికెట్లు సామాన్య ప్రయాణికులకు అందుబాటులో లేకుండా సాఫ్ట్‌వేర్ ద్వారా బ్లాక్ చేసేవారు. ఏజెంట్లను అదుపులోకి తీసుకోవడంతో ఇకపై తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలని భావించే వారికి మరిన్ని ఎక్కువ తత్కాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. అలాగే ఇది వరకు కొన్ని నిమిషాలు మాత్రమే అందుబాటులో ఉండే ఈ టికెట్లు ఇప్పుడు కొన్ని గంటల పాటు అందుబాటులో ఉంటాయి. ఇండియన్ రైల్వేస్ అధికారుల ప్రకారం.. ANMS. MAC, జాగ్వార్ వంటి సాఫ్ట్‌వేర్లతో IRCTC లాగిన్ క్యాప్చా, బుకింగ్ క్యాప్చా, బ్యాంక్ ఓటీపీ వంటి వివరాలతో ఏజెంట్లు తత్కాల్ టికెట్లను బ్లాక్ చేసేవారు. దీన్ని గమనించిన రైల్వేస్ ఇప్పుడు ఆ ఏజెంట్లను అరెస్ట్ చేసింది. మనం ఎవరైనా సరే తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలని భావిస్తే సగటున 2.55 నిమిషాల టైమ్ పడుతుంది. కానీ ఈ ఏజెంట్లు సాఫ్ట్‌వేర్ సాయంతో కేవలం 1.48 నిమిషాల్లోనే తత్కాల్ టికెట్‌ ను బుక్ చేసేవారు. దీంతో సాధారణ రైల్వే ప్రయాణికులకు ఎక్కువ తత్కాల్ టికెట్లు అందుబాటులో ఉండేవి కాదు.

Image result for indian railway

తత్కాల్ టికెట్ బుకింగ్ ద్వారా ఏజెంట్లు సంవత్సరానికి ఏకంగా రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్లు బిజినెస్ నిర్వహించే వారని RPF డైరెక్టర్ జనరల్ తెలిపారు. ఇకపై చట్టవిరుద్దమైన సాఫ్ట్‌వేర్ తో ఒక్క తత్కాల్ టికెట్ కూడా బుక్ చేయకుండా కఠిన చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఎవ్వరూ కూడా ఇలాంటి సాఫ్ట్‌వేర్స్ ఉపయోగించవద్దని హెచ్చరించారు. ఇండియన్ రైల్వేస్ తీసుకున్న నిర్ణయంతో ఇప్పటికే తత్కాల్ టికెట్ బుకింగ్ లభ్యత పెరిగింది. మగధ ఎక్స్‌ప్రెస్‌ లో 2019 అక్టోబర్ 26న తత్కాల్ టికెట్లు 2 నిమిషాలు అందుబాటులో ఉండేవి. 2020 ఫిబ్రవరి 10న తత్కాల్ టికెట్ల 10 గంటలపాటు అందుబాటులో ఉన్నాయి. అలాగే సంపూర్ణ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ లో కూడా తత్కాల్ టికెట్ లభ్యత 4 నిమిషాల నుంచి 18 నిమిషాలకు పెరిగింది. ఇలా ఇండియన్ రైల్వే శాఖ తత్కాల్ టికెట్ విషయంలో ఇబ్బంది పడే ప్యాసింజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది.

Content above bottom navigation