సెల్ ఫోన్ల గురించి కొన్ని అద్భుతమైన మైండ్‌బ్లోయింగ్ నిజాలు…

66

సెల్ ఫోన్ల గురించి కొన్ని అద్భుతమైన మైండ్‌బ్లోయింగ్ నిజాలు…

ఈరోజుల్లో టెక్నాల‌జీ మ‌న‌ల్ని న‌డిపిస్తుంది
సెల్ ఫోన్ స‌మ‌స్తం అయిపోయింది.
ఈరోజుల్లో సెల్‌ఫోన్‌లేని జీవితాలు లేవంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకప్పుడు ల్యాండ్ ఫోన్ ఉంటేనే గొప్పగా భావించేవారు. ఇప్పుడు పేద గొప్ప అనే తారతమ్యం లేకుండా అందరూ ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లను వాడుతున్నారు. చిన్నారుల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఫోన్‌లు వాడేవారే. ఏదైనా అతి అనర్థమే. అవసరాలకు సెల్‌ఫోన్ వాడుకుంటే పరవాలేదు. కానీ అదే లోకం అయిపోతుంది

అవసరానికి మాత్రమే కాకుండా స్టేటస్ సింబల్‌గా కూడా మారిపోయింది సెల్‌ఫోన్. ఉదయం లేచింది మొదలు అర్థరాత్రి పడుకునే వరకు అది పనిచేస్తూనే ఉంటుంది. ఫోన్ లేకుంటే అమ్మో అనే స్థితికి చేరుకున్నాం. బంధాలు అనుబంధాలనేవి కూడా మూలనపడ్డాయనే చెబుతున్నారు నిపుణులు… దీంతోపాటు ఫోన్‌లో ఎవరు ఏం చూస్తున్నారో ఎవరికీ తెలియని పరిస్థితి… పురుషుల కంటే మహిళలే ఫోన్‌ను ఎక్కువగా వాడుతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇలా సెల్ ఫోన్ వ‌చ్చి కొన్ని ద‌శాబ్ద‌పు రికార్డులు న‌మోదు చేసింది… మ‌రి వీటి గురించి కొన్ని మైండ్ బ్లోయింగ్ విష‌యాలు తెలుసుకుందాం..

Image result for cellphones

చరిత్రలో అత్యధికంగా అమ్ముడైన సెల్‌ఫోన్ నోకియా 1100,ఈ బేసిక్ వెర్ష‌న్ ఫోన్లు 25 కోట్లకు పైగా అమ్మారు. రెండవ స్ధానంలో ఐఫోన్ 6 ఉంది ఇప్ప‌టి వ‌ర‌కూ 22 కోట్ల ఫోన్లు అమ్మారు.

ప్రపంచంలోని మొట్టమొదటి మొబైల్ ఫోన్ కాల్ ఏప్రిల్ 3, 1973 న చేయబడింది, మోటరోలాలో సీనియర్ ఇంజనీర్ అయిన మార్టిన్ కూపర్ తమ ప్రత్యర్థి టెలికమ్యూనికేషన్ సంస్థకు కాల్ చేసి, నేను మొబైల్ ఫోన్ ద్వారా మాట్లాడుతున్నాను అని వారికి సమాచారం ఇచ్చాడు.

మొట్టమొదటి వాణిజ్య మొబైల్ ఫోన్‌ “మోటరోలా డైనటాక్ 8000 ఎక్స్” ను 1983 లో మోటరోలా విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్ 30 నిమిషాల టాక్‌టైమ్, ఆరు గంటల స్టాండ్‌బై చార్జింగ్ అలాగే 30 ఫోన్ నంబర్‌లను సేవ్ చేయగలదు. దీని ధర అప్ప‌ట్లో 4000 అమెరికన్ డాలర్లు.

2012 లో, ఆపిల్ రోజుకు 3,ల‌క్ష‌ల 40,000 ఐఫోన్లను అమ్మింది. అంటే సెకనుకు సుమారు 4 ఫోన్‌లు అమ్మ‌కాలు చేసింది

సెల్ ఫోన్ల పైన టాయిలెట్ హ్యాండిల్స్ కంటే 18 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది.

జపాన్లో, 90% సెల్ ఫోన్లు వాటర్ ప్రూఫ్.

ప్రస్తుతం వాడుతున్న సెల్‌ఫోన్‌ల కంప్యూటింగ్ శక్తి చంద్రునిపైకి దిగడానికి నిర్మించిన అపోలో 11 ఉపయోగించిన కంప్యూటర్ శక్తి కంటే ఎక్కువ.

బ్రిటన్లో, ప్రతి సంవత్సరం ల‌క్ష‌ సెల్ ఫోన్లు టాయిలెట్లో ప్రమాదవశాత్తు పడిపోతాయి.ఇక్క‌డ అంద‌రూ వాష్ రూమ్ కు మొబైల్ తీసుకువెళ‌తారు

మ‌న ప్ర‌పంచంలో 70శాతం సెల్ ఫోన్లు చైనాలో తయారవుతాయి.

ప్రపంచ జనాభాలో 80% మందికి సెల్ ఫోన్ ఉంది.

90శాతం కంటే ఎక్కువ మంది తమ సెల్ ఫోన్‌ను 24 గంటలూ చేతికి అందుబాటులో ఉండేటట్టు ఉంచుతారు.

సెల్ ఫోన్ పరిశ్రమ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, “సోనిమ్ ఎక్స్‌పి 3300 ఫోర్స్” ఫోన్ దృఢమైన ఫోన్‌గా గుర్తించబడింది. ఇది 84-అడుగుల ఎత్తునుండి నేల మీదకు జారవిడిచినా కూడా ఎటువంటి డామేజ్ లేకుండా బయటపడింది.

ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఫోన్ “ఐఫోన్ 5 బ్లాక్ డైమండ్”, దీని ధర 15 మిలియన్ అమెరికన్ డాలర్లు. ఈ ఫోన్ తయారు చేయడానికి 125 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఉపయోగించారు. అలాగే 600 వజ్రాలను తో పొదగబడింది. మ‌రి చూశారుగా
సెల్ ఫోన్ గురించి అనేక విష‌యాలు,మ‌రి ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను కామెంట్స్ రూపంలో తెలియ‌చేయండి.

Content above bottom navigation