AP ఇళ్ల పట్టాలు.. కొన్ని ఊర్లలో ఇంకా ఎందుకు ల్యాటరీ తీయలేదు..

148

ఏపీ సీఎం జగన్ నవరత్నాల్లో భాగంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న విషయం తెలిసిందే. పేదలందరికీ ఇళ్లు పథకానికి ప్రభుత్వం కొత్త రూల్స్ ను జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల్లో ఉన్న పేదవాళ్లందరికీ సెంటు భూమి చొప్పున ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఎకరానికి 55 మంది ఇళ్ల స్థలాలను పొందే అవకాశం ఉంటుంది. ఇల్లు ఇచ్చేరోజునే ఆ ఇంట్లోని అక్కా చెల్లెళ్ల పేరుపై ఇంటిని రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇళ్ల స్థలాలతో పాటు ప్రభుత్వం అపార్ట్‌మెంట్లను నిర్మించి ఫ్లాట్లను ఇవ్వాలని చూస్తోందని సమాచారం. 2020 సంవత్సరం ఉగాది పండుగ నాటికి 25 లక్షల మంది పేదవాళ్లకు ఇళ్ల స్థలాలను ఇవ్వాలని వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంటిస్ధలం పట్టాల పంపిణీ ఇవ్వాలని ప్రణాళిక వేసుకున్న ఏపీ ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. లాటరీ విధానంలో లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఏపీ సర్కారు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటి స్థలాలకు సంబంధించి ఇప్పటికే గ్రామ, వార్డు వారీగా అర్హులైనవారి జాబితా సిద్ధంగా ఉండగా.. బుధవారం నుంచి లాటరీ పద్దతిలో లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. వారందరికీ ఈ నెల 15 నుంచి పట్టాల రిజిస్ట్రేషన్‌ ప్రారంభించాలని.. ఈ నెల 25న రిజిస్ట్రేషన్ చేసిన పట్టాలను లబ్దిదారులకు అందించాలని రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి వి. ఉషా రాణి తమ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కాకినాడ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించేలా రెవెన్యూ శాఖ కార్యాచరణ రూపొందిస్తోంది. ఉగాది నాటికి 25 లక్షల మంది ఇంటిస్ధలం పట్టాల పంపిణీ చేపట్టాల్సిందేనంటూ తన ఉత్తర్వుల్లో ఆమె స్పష్టం చేశారు.ఈ మేరకు జిల్లా కలెక్టర్లు ఏర్పాట్లు చేయాలని ఉషా రాణి ఆదేశించారు. అయితే కొన్ని ఊర్లలో ఇంకా లాటరీ సిస్టమ్ అనేది స్టార్ట్ అవ్వలేదు. దీంతో కొన్ని గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కానీ ఎవరు కూడా దీని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ లాటరీ అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క ఊరిలో తీస్తారు. దీనికి పర్టికులర్ షెడ్యూల్ ఏమి ఇవ్వలేదు. అక్కడ ఉన్న అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమయాన్ని బట్టి ఒక షెడ్యూల్ ను ఫిక్స్ చేసుకుని లాటరీ తీస్తారు. అయితే ఇంకా లాటరీ తీయని గ్రామాలలో ఇళ్ల పట్టాల పంపిణి పోస్ట్ ఫోన్ అవ్వనుంది. ఎందుకంటే.. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది.

ఇప్పుడు ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ పని మీద ఉన్నారు. కాబట్టి ఉగాది నాటికి ఇళ్ల పట్టాల పంపిణి అనేది ఆలస్యం కానుంది. మార్చి 29 నాటికి ఎన్నికలు కంప్లీట్ అవుతాయి. అప్పటివరకు ఇళ్ల పట్టాల పంపిణి అనేది జరగకపోవచ్చు. కాబట్టి ఇంకా లాటరీ తీయని గ్రామాల ప్రజలు ఎలాంటి దిగులు పడకండి. ఇక ఇళ్ల పట్టాలతో పాటు వేరే స్కీమ్ లకు సంబందించిన పనులు కూడా కొంచెం ఆలస్యం అవ్వొచ్చు. రేషన్ కార్డులకు సంబంధించి కూడా కొంచెం ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉంది. మార్చిలోనే రేషన్ కార్డులను సప్ప్లై చెయ్యాలి. కానీ ఎన్నికల కారణంగా దీనిని ఏప్రిల్ కు పోస్ట్ పోన్ చేశారు. కాబట్టి ఇళ్ల పట్టాలకు సంబంధించి ఇంకా లాటరీ తీయని గ్రామాల ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోకండి. త్వరలోనే మీ ఊర్లలో కూడా ఇళ్ల పట్టాలకు సంబంధించి లాటరీలు తీస్తారు.

Content above bottom navigation