AP ప్రజలకు షాకింగ్ న్యూస్ : ఉగాదికి ఇళ్ల పట్టాల పంపిణి లేదు

ఏపీ సీఎం జగన్ నవరత్నాల్లో భాగంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న విషయం తెలిసిందే. పేదలందరికీ ఇళ్లు పథకానికి ప్రభుత్వం కొత్త రూల్స్ ను జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల్లో ఉన్న పేదవాళ్లందరికీ సెంటు భూమి చొప్పున ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఎకరానికి 55 మంది ఇళ్ల స్థలాలను పొందే అవకాశం ఉంటుంది. ఇల్లు ఇచ్చేరోజునే ఆ ఇంట్లోని అక్కా చెల్లెళ్ల పేరుపై ఇంటిని రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇళ్ల స్థలాలతో పాటు ప్రభుత్వం అపార్ట్‌మెంట్లను నిర్మించి ఫ్లాట్లను ఇవ్వాలని చూస్తోందని సమాచారం.

2020 సంవత్సరం ఉగాది పండుగ నాటికి 25 లక్షల మంది పేదవాళ్లకు ఇళ్ల స్థలాలను ఇవ్వాలని వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని పనిచేసింది. కానీ తమకు ఇళ్ల పట్టాలు వస్తాయని, ఉగాది పండుగ రోజున పట్టా చేతికి అందుకోబోతున్నామని అనుకున్న పేదలకు షాకింగ్ న్యూస్ వినిపించింది ఎలక్షన్ కమిషన్..ఇళ్ల పట్టాలు చేయవద్దని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

దీంతో 2020, మార్చి 25వ తేదీన ఉగాది పండుగ రోజున ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని అనుకున్న ఈ కార్యక్రమం పెండింగ్‌లో పడినట్లైంది. ఏపీలో ఇళ్ల పట్టాలకు బ్రేక్ పడింది. జగన్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తూ..ఉగాది పండుగ రోజున ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కానీ దీనికి ఈసీ నో చెప్పింది. స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 2020, మార్చి 07వ తేదీన రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. కోడ్ ఉండడంతో కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులు నిబంధనల విషయంలో కఠినంగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

అయితే..ప్రభుత్వం ఉగాది పండుగ రోజున 25 లక్షల ఇళ్ల పట్టాలు చేయాలని నిర్ణయం తీసుకుందని, దీనిని ఆపివేయాలని కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. ఈసీకి కూడా పలు కంప్లయింట్స్ అందాయి. అన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత..ఇళ్ల పట్టాలు ఇప్పుడు పంపిణీ చేయాల్సిన అవసరం లేదని, ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం నిర్ణయం తీసుకోవాలని ఈసీ సూచించింది. టోకెన్లు కూడా ఇవ్వకూడదని, ఈ కార్యక్రమాల్లో అధికారులు పాల్గొనకూడదని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రస్తుతం ఈసీ చేసిన ఆదేశాల ప్రకారం ఉగాది పండుగకు ఇళ్ల పట్టాల కార్యక్రమం వాయిదా పడనుంది. తర్వాత ఎప్పుడు పంపిణీ చేస్తారనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

Content above bottom navigation