AP ప్రజలకు 4 శుభవార్తలు ముఖ్యంగా డ్వాక్రా మహిళలకి పెద్ద న్యూస్.. తప్పక తెలుసుకోండి

సంచలనాలకు కేంద్ర బిందువు అయినా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రజలకు వరాల మీద వరాలు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రుణాలు, పెన్షన్స్, ఇళ్ల పంపిణి లాంటి ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు వరాలు ఇస్తున్న జగన్ ఇప్పుడు 4 శుభవార్తలు చెప్పాడు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో ని చూడండి..

1, ఏపీలో ఉన్న లక్షలాది మంది పెన్షనర్లకు ఫిబ్రవరి నుంచి పిన్షన్ ఇవ్వనున్నారు. అయితే ఈ పిన్షన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, ఎప్పుడు ఇస్తారో అని ఎదురుచూడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి జగన్ అంటున్నారు. గ్రామా వాలంటీర్ మీ ఇంటికి వచ్చి, మీకు పిన్షన్ ఇచ్చి, ధ్రువీకరణ సర్టిఫికెట్ మీద సంతకం తీసుకుంటాడు. కాబట్టి వయోవృద్ధులు అందరు కూడా ఇక నుంచి పిన్షన్ కోసం వెయిట్ చెయ్యాల్సిన పనిలేదు. ఒకవేళ గ్రామా వాలంటీర్ లేట్ గా పిన్షన్ ఇస్తే..కంప్లైంట్ ఇవ్వొచ్చు..ప్రభుత్వం అతని మీద చర్యలు తీసుకుంటుంది.

  1. ప్రభుత్వం ఏప్రిల్ నుంచి నాణ్యమైన బియ్యాన్ని పంపిణి చేయనుంది. గ్రామా వాలంటీర్లు ఇంటికొచ్చి రేషన్ ను మీకు అందిస్తారు. 5,10,15,20 కిలోల బ్యాగులలో బియ్యాన్ని ఇవ్వనున్నారు. కాబట్టి తూకాల విషయంలో ఎలాంటి మోసాలు జరగవు. త్వరలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలు కంప్లీట్ అవ్వగానే పౌర సరఫరా శాఖ అధికారులు లబ్దిదారులకు బియ్యం కార్డులను ఇవ్వనున్నారు.
  2. ఇంటర్ తరువాత కేవలం 23 శాతం మంది స్టూడెంట్స్ మాత్రమే ఉన్నత చదువులకు వెళ్తున్నారు. మిగతా 77 శాతం మంది స్టూడెంట్స్ రకరకాల కారణాల వలన చదువును మానేస్తున్నారని, అందులో డబ్బు సమస్య వలన చాలామంది చదవడం లేదని ప్రభుత్వం గుర్తించింది. అందుకే అలంటి వారి కోసం జగన్ అన్న విద్య దీవెన పథకం ప్రవేశపెట్టారు. ఎంత చదువు చదవాలన్న ప్రభుత్వం చదివిస్తుంది. వసతి దీవెన కింద హాస్టల్ ఖర్చులు కూడా భరిస్తాం అని జగన్ చెప్పారు. ప్రతి ఏడాది ఫిబ్రవరిలో 10 వేలు, ఆగస్టు లో మరొక 10 వేల రూపాయలను స్టూడెంట్స్ తల్లిదండ్రులు అకౌంట్ లో హాస్టల్ ఖర్చుల కోసం జమ చేయనున్నారు.
  3. డ్వాక్రా మహిళలకు జగన్ శుభవార్త అందించారు. డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలను నాలుగు విడతలుగా మాఫీ చెయ్యనున్నారు. ఐతే దీనికి సంబందించిన కీలక ప్రకటనను జనవరి 26 వ తేదీన ప్రకటించనున్నారు. జనవరి 26 న మొదటి విడత రుణమాఫీ ఉండనుందని అందరు అనుకుంటున్నారు. చూడాలి మరి జగన్ ఎలాంటి ప్రకటన ఇస్తాడో..

మరి జగన్ చెప్పిన ఈ నాలుగు శుభవార్తల మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.

Content above bottom navigation