డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డ్వాక్రా మహిళలు తీసుకున్న లోన్స్‌కు బ్యాంకు లింకేజీ ద్వారా వడ్డీ చెల్లించేందుకు సిద్దమయ్యాము అని గతంలో చెప్పారు సీఎం జగన్ . వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద 4 విడతల్లో ఈ చెల్లింపులు జరుపనున్నారు. మొదట మహిళల బ్యాంకు ఖాతాల్లో ఒక రూపాయి జమ చేసి.. తర్వాత వడ్డీ వేయడం ప్రారంభిస్తాము అన్నారు.. అయితే తాజాగా ఆ పని కూడా పూర్తి చేస్తోంది ఏపీ సర్కారు.
పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో ని చూడండి..
కొంత మంది బ్యాంకు ఖాతాల్లో ఇప్పుడు వడ్డీ జమ అయింది అని తెలుస్తోంది.. జనవరి 26 అని అన్నారు ఫ్రిబ్రవరి 10 అన్నారు కాని అప్పుడు జమ అవ్వలేదు, కాని ఇప్పుడు చాలా మందికి వడ్డీకింద రెండు నెలల అమౌంట్ జమ చేశారు, రెండు నెలల వడ్డీ అప్పు ఖాతాలో జమ అయింది, అది పొదుపు ఖాతాలో జమ చేయలేదు, ఈనగదు కచ్చితంగా డ్వాక్రా మహిళలు తీసుకోవాల్సిందే దీనిని అప్పుగా ఎలాంటి లెస్ చేయరు.
ఇక మార్చి 25 లోపు అందరికి కచ్చితంగా అకౌంట్లోకి నగదు జమ చేస్తాము అని చెప్పారు అధికారులు.. రుణమాఫీకి సంబంధించి నాలుగు నెలల వడ్డీ బ్యాలెన్స్ మొదటి విడతగా మీకు ఎంత వస్తుందో అంత అకౌంట్లోకి జమచేస్తారు.. ఇక కొత్తగా ఎవరైనా చేరాలి అని అనుకుంటే కొత్త గ్రూపులు తీసుకుంటారు, టీమ్ గా చేరితే డ్వాక్రా కొత్త గ్రూప్ ఏర్పాటు చేస్తాము అని అధికారులు చెప్పారు. అయితే రెండు నెలల వడ్డీ కొందరికి క్రెడిట్ అయింది అని చాలా మంది చెబుతున్నారు, ఈ వారంలో మొత్తం అందరికి నగదు చెల్లిస్తారు, గత రెండు నెలలుగా అన్నీ కొత్త పథకాలు ప్రవేశపెట్టడంతో ఇది లేట్ అయింది అంటున్నారు.. దాదాపు 60 లక్షల మంది ఈ అమౌంట్ కోసం చూస్తున్నారు.. ఉగాది తర్వాత వారికి గుడ్ న్యూస్ చెప్పనున్నారట సీఎంజగన్.
ఇక జగన్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామిలో భాగంగా.. ‘వైఎస్ఆర్ ఆసరా’ పథకం ద్వాకా డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలను మాఫీ చేయనుంది ఏపీ ప్రభుత్వం. 2019 ఏప్రిల్ 11వ తేదీకి ముందు తీసుకున్న రుణాలను మొత్తం నాలుగు విడుతల్లో మాఫీ చేయనున్నారు. కాకపోతే లోన్ తీసుకున్న డ్వాక్రా సంఘాలు బకాయిలు కడుతూనే ఉండాలి. తర్వాత ఆ డబ్బులను వారి బ్యాంకు అకౌంట్లలో ప్రభుత్వం జమ చేస్తోంది.