రెండు పడకల ఇళ్ళ పథకం పై జగన్ మరో సంచలన నిర్ణయం ఆందోళనలో AP ప్రజలు

64

ఏపీలో ఇప్ప‌టికే ఉగాదికి 25 ల‌క్ష‌ల మంది పేద‌ల‌కు, ఇళ్లు లేని వారికి స్ధ‌లాలు ఇవ్వాలి అని సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యించారు..
అయితే ప్రభుత్వం గతంలో ఇచ్చిన స్థలంలో ఇంకా ఇల్లు కట్టుకోక‌పోతే దానిపై ఆశలు వదులుకోవాల్సిందే. గతంలో ఇచ్చిన ఇంటిస్థలాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్న వారికి ప్రభుత్వం కోలుకోలేని షాక్‌ ఇస్తోంది. ఇల్లు కట్టుకోలేదన్న కారణంతో ఆ భూములు లాక్కుంటోంది. బాధితులకు ఎలాంటి నోటీసులు, ముందస్తు సమాచారం ఇవ్వకుండానే రెవెన్యూ యంత్రాంగం ఆ భూములను మరొకరికి కేటాయిస్తోంది.

పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో ని చూడండి..

వారికి స్లిప్‌లు ఇస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కింద అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చేతుల మీదుగా భూములు పొందిన రైతులు కూడా ఇప్పుడు ఇంటిస్థలాలు కోల్పోతున్నారు. దీంతో ప్రభుత్వ ఖాతాలో జమవుతున్న భూముల సంఖ్యకు అనుగుణంగా వాటిని కోల్పోతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ముందు ప్రభుత్వ శాఖల ద‌గ్గ‌ర ఉన్నవాటితో పాటు ప్రైవేటు భూములు ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. పేదలకిచ్చిన అసైన్డ్‌ భూములపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. అలాగే నిరుపేదలు, దళితులు, గిరిజనులు, అణగారిన వర్గాలవారు గతంలో ప్రభుత్వం నుంచి భూములు తీసుకొని, ఇప్పటిదాకా నిర్మాణాలు చేపట్టకపోతే వాటిని కూడా వెనక్కు తీసుకోవాలని రెవెన్యూశాఖను ఆదేశించింది.

ఇంటిస్థలాలపై ఇచ్చిన మార్గదర్శకాల ఉత్తర్వు(జీఓ.367)లో ఈ అంశాలను జోడించారు. గతంలో అనేకమందికి ఇంటిస్థలాలు కేటాయించారు. ఆ భూములు వినియోగించుకోకున్నా, నిర్మాణాలు చేయకుండా ఖాళీగా ఉంచితే నిబంధనల ప్రకారం వాటిని వెనక్కు తీసుకోండిఅని స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో రెవెన్యూ అధికారులు అసైన్డ్‌ ఇంటిస్థలాల అన్వేషణ చేపట్టారు. ఆ స్థలంలో పేదలు గుడిసెలు వేసుకున్నా దాన్ని ఇంటిగా పరిగణించకుండా ఖాళీగానే ఉంచారంటూ నివేదికలు రూపొందించారు. ఆపై కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేసి స్లిప్‌లు వారికి జారీ చేస్తున్నారు. అదేమంటే ‘పైనుంచి ఆదేశాలు వచ్చాయి. కావాలంటే ఇంటిస్థలం కోరుతూ మరోసారి దరఖాస్తు చేసుకోండి అని అధికారులు సలహాలిస్తున్నారని బాధితులు వాపోతున్నారు.

పేదలకు ఏటా ప్రభుత్వం 75- 100 చదరపు గజాల ఇంటిస్థలాలు కేటాయిస్తోంది. దాంట్లో మూడేళ్ల వ్యవధిలో ఇళ్లు నిర్మించుకోవాలనేది నిబంధన. అంత తక్కువ సమయంలో ఇల్లు కట్టుకోవడం సాధ్యమయ్యే పనికాదు. పక్కా భవనాలు నిర్మించుకోలేనివారు తమకిచ్చిన స్థలాల్లో గుడిసెలు వేసుకున్నారు. నూటికి 75శాతం కేసులు ఇలాంటివే. గ్రామంలో ఉపాధి దొరక్క, బతుకుతెరువు కోసం సొంత ఊరు, ఇల్లు వదిలి వలస పోయినవారు అనేకమంది ఉన్నారు. మ‌రి దీనిపై ఏపీ స‌ర్కారు మ‌రోసారి ఆలోచిస్తోందో లేదో చూడాలి.

Content above bottom navigation