AP ప్రజలకు జగన్ శుభవార్త.. ఇళ్ల స్థలాల లాటరీ లిస్ట్ విడుదల కేవలం వీరికి మాత్రమే మార్చి 15 న ఇల్లు స్యాంక్షన్

ఏపీ ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశ పెట్టింది. లాటరీ విధానం లో ఇళ్ల స్ధ‌లాల లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఉగాది నాడు ఇవ్వబోతున్న .. ఇంటి స్థలాలకు సంబంధించి ఇప్పటికే గ్రామ వార్డు వారీగా అర్హులైనవారి జాబితా సిద్ధంగా ఉంది. దీనితో నేటి నుంచి లాటరీ పద్దతి లో లబ్ధిదారులను ఎంపిక చేసి అలా లాటరీ ద్వారా ఎంపికైన వారందరికీ ఈ నెల 15 నుండి పట్టాల రిజిస్ట్రేషన్ ప్రారంభించాలని తెలిపారు… అలాగే ఈ నెల 25న ఉగాది నాడు రిజిస్ట్రేషన్ చేసిన పట్టాలను లబ్దిదారులకు అందించాలని నిర్ణ‌యించారు

పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో ని చూడండి..

కాకినాడ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించేలా రెవెన్యూ శాఖ కార్యాచరణ రూపొందిస్తోంది. ఉగాది నాటికి ఎట్టి పరిస్థితుల్లో 25 లక్షల మందికి ఇంటి స్ధలం పట్టాలని పంపిణీ చేపట్టాల్సిందేనంటూ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఉగాది పండుగ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే కార్యక్రమానికి రాష్ట్ర కేబినెట్ కూడా తాజాగా ఆమోదం తెలిపింది.. మొత్తం ఏపీలో 43,101 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల రూపంలో పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.. పేద‌ల‌కు అందించే ఇంటి పట్టాను నిర్దేశిత ఫార్మాట్‌లో ప్రభుత్వమే రిజిస్ట్రేషన్‌ చేసి లబ్ధిదారులకు అందజేస్తుంది.

ఇలా ఇంటి స్థలం పొందిన లబ్ధిదారులు ఐదేళ్ల పాటు ఇళ్లు కట్టుకునేందుకు, లేదా వ్యక్తిగత అవసరాలకు బ్యాంకులో తనఖా పెట్టుకునే హక్కు కల్పించ‌నున్నారు.. ఐదేళ్ల తరువాత దానిని య‌జ‌మాని అమ్ముకునేందుకు కూడా హక్కు కల్పిస్తున్నారు.
ఈ ప్రక్రియను సులభతరం చేసేందుకు రాష్ట్రంలో ఉన్న అందరూ తహశీల్దార్లకు జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రర్‌ హోదా ఇస్తున్నారు.

రాష్ట్రంలో 26,976 ఎకరాల ప్రభుత్వ భూమి, అలాగే 16,164 ఎకరాల ప్రైవేట్‌ భూములు కొనుగోలు చేసి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించి ఇప్ప‌టికే స‌ర్వే మార్కింగ్ ప్ర‌క్రియ పూర్తి చేశారు.. ఈ విధంగా వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కారు పేదలకు ఇచ్చే స్ధ‌లాల‌కు ఆయా కాలనీలకు వైఎస్సార్ జగనన్న కాలనీలుగా నామకరణం చేస్తున్నారు.. ఇక రిజిస్ట్రేష‌న్ బాధ్య‌త‌లు అన్నింటిని స్ధానిక ఎమ్మార్వో పూర్తి చేసి ఇవ్వ‌నున్నారు.ఒకసారి ఇళ్ల ప‌ట్టా వ‌చ్చిన త‌ర్వాత ఐదు సంవ‌త్స‌రాల వ‌ర‌కూ దానిని అమ్మ‌డం లేదా బ్యాంకుల్లో త‌న‌ఖా పెట్టుకోవ‌డం కుద‌ర‌దు అని తెలిపారు.

Content above bottom navigation