ఇళ్ల స్థలాల పట్టాలు మార్చి 25న వీరికి మాత్రం మొదటి విడతలోనే సాంక్షన్ చేస్తున్న జగన్ మీరు కూడా లిస్ట్ లో ఉన్నారా ?

54

ఏపీలో ఉగాదికి మ‌రో స‌రికొత్త నిర్ణ‌యం తీసుకుంటున్నారు సీఎం జ‌గ‌న్.. దాదాపు 25 ల‌క్ష‌ల మందికి పేద‌ల‌కు ఇళ్ల ప‌ట్టాలు అందించ‌నున్నారు. ఇప్ప‌టికే స‌రిహ‌ద్దులు మార్కింగ్ గ్రాఫింగ్ పేర్ల న‌మోదు ద‌స్తావేజుల త‌యారీ అన్నీ ప‌నులు పూర్తి అవుతున్నాయి. భూములను సేకరించి చదును చేయడం, ప్లాటింగ్, మార్కింగ్‌ జరుగుతోంది. లబ్ధిదారుల పేరిట ప్రభుత్వం రూ.పది స్టాంప్‌ పేపర్‌పై ఇంటి స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేసి అందించనుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రెవెన్యూ శాఖ జిల్లా అధికార యంత్రాంగానికి ఇప్ప‌టికే పంపింది. అయితే తాజాగా దీనికి సంబంధించి ఈ రిజిస్ట్రేష‌న్ డాక్యుమెంట్ కూడా ఎలా ఉంటుందో విడుద‌ల అయింది అది చూద్దాం.

పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో ని చూడండి..

.48 గ‌జాలు ప‌ట్ట‌ణాలు, అలాగే గ్రామాల్లో 72 గ‌జాలు స్ధాయిలో నిర్మించిన ఇళ్ల‌ను వీరికి ఇవ్వ‌నున్నారు.ఇక ఇంటి ప‌ట్టా ఎలా ఉంటుంది అనేది కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. రిజిస్ట్రార్‌ కార్యాలయ డాక్యుమెంట్‌ రూ.పది స్టాంపు పేపర్‌ తొలి పేజీలో లబ్ధిదారుడి సమాచారంతో పాటు తహసీల్దారు సంతకం ఉంటుంది. రెండో పేజీలో ఇంటి స్థలం, సరిహద్దు వివరాలు, తహసీల్దారు సంతకం ఉంటుం ది. మూడో పేజీ (ఫారం 32-ఏ)లో తొలుత తహసీల్దారు / ప్రతినిధి ఎడమ చేతి బొటన వేలి ముద్ర వేసి పాస్‌పోర్టు ఫోటో అతికించి సంతకం చేసి చిరునామా పూరిస్తారు. తరువాత లబ్ధిదారులు/ ఆమె ప్రతినిధి ఎడమ చేతి బొటన వేలు ముద్ర వేసి పాస్‌ పోర్టు ఫొటో అతికించి సంతకం చేసి చిరునామా పూరిస్తారు. స్టాంప్‌ పేపర్‌పై సాక్షి, తహసీల్దారు సంతకాలు చేస్తారు.

డాక్యుమెంట్‌ మూడు పేజీలను స్కానింగ్‌ చేసి రిజిస్ట్రార్‌ కార్యాలయానికి పంపిస్తారు. లబ్ధిదారుల పేరిట తహసీల్దారులే రిజిస్ట్రేషన్‌ చేయిస్తారు. రూ.పది స్టాంపు పేపర్‌పై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, రెవెన్యూ శాఖ ఇంటి స్థలం పట్టా అని ఉంటుంది. లబ్ధిదారులు ఇంటి స్థలాన్ని వంశపారంపర్యంగా అనుభవించ వచ్చు. అవసరాల నిమిత్తం ఇంటి స్థలాన్ని బ్యాంకులో ఎప్పుడైనా తనఖా పెట్టుకోవచ్చని పట్టాలో పేర్కొన్నారు. అవసరమైతే ఐదేళ్ల తరువాత ఇంటి స్థలాన్ని విక్రయించుకోవచ్చు, కొనుగోలు చేయవచ్చు. మంజూరు చేసిన స్థలంలో అమలులో ఉన్న చట్టాలకు లోబడి నివాస కట్టడాలు చేపట్టవచ్చు. నవరత్నాల పథకాల వివరాలతోపాటు వైఎస్సార్, ముఖ్యమంత్రి జగన్‌ ఫొటోతో కూడిన లోగోను ఇంటి స్థలం పట్టాపై ముద్రించారు. అయితే త‌ల్లితండ్రి పేద‌వారు అయితే వారికి ఇంటిని కేటాయిస్తారు, అలాగే వారికి కొడుకులు ఉన్నా వారికి స‌ప‌రేట్ ఇంటిని కేటాయిస్తున్నారు, ఇంటిలో ఆరుగురు పిల్లలు ఉన్నా ఐదుగురు పిల్లలు ఉన్నా అర్హులు అయితే అంద‌రికి ఇళ్లు ఇవ్వ‌నుంది వైసీపీ స‌ర్కార్.
ఉగాది రోజు సీఎం జ‌గ‌న్ ఈ కార్య‌క్ర‌మం ప్రారంభించిన త‌ర్వాత.. నియోజ‌క‌వ‌ర్గాల్లో పేద‌ల‌కు ఎమ్మెల్యేలు మంత్రులు ఈ ఇళ్ల‌ను అందించ‌నున్నారు.

Content above bottom navigation