పేదల ఉచిత ఇళ్ల పట్టాల పంపిణీ పై సస్పెన్స్ ఈ విషయం తెలుసుకోండి అయోమయంలో AP ప్రజలు

ఏపీలో ప్ర‌భుత్వం చాలా వ‌ర‌కూ ఉగాది రోజున పేద‌ల‌కు ఇళ్ల‌ప‌ట్టాలు అందివ్వాలి అని భావించింది.. ఆరోజు స‌మారు పేద‌ల‌కు 26 ల‌క్ష‌ల మందికి ఇళ్ల‌ప‌ట్టాలు ఇవ్వాలి అని రెడీ అవుతోంది. ఈ స‌మ‌యంలో అమ‌రావ‌తి ప్రాంతంలో రైతులు కూడా ఓ ఆందోళ‌న‌లో ఉన్నారు, అస‌లు త‌మ‌కు ఇళ్ల‌ప‌ట్టాలు ఆరోజు అందుతాయా మ‌రే కార‌ణాలు అయినా దీనికి బ్రేక్ వేస్తాయా అని డైల‌మాలో ఉన్నారు.

పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో ని చూడండి..

ఈ వ్య‌వ‌హారినికి సంబంధించిన పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్‌లో పెట్టింది. సీఆర్డీఏ చట్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం విజయవాడ, తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల నుంచి వచ్చిన వారికి భూములు కేటాయించాలనడం చట్ట విరుద్ధమని కొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే, బయటివారికి ఇళ్లపట్టాలు ఇవ్వకూడదని సీఆర్డీఏ చట్టంలో ఎక్కడా లేదని ప్రభుత్వం వాదించింది.

పిటిషనర్ల తరఫున మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. లాండ్ పూలింగ్ స్కీమ్ కింద తీసుకున్న భూమిలో 5 శాతాన్ని భవిష్యత్తులో అమరావతికి వలసవచ్చే పేదలకు తక్కువ ధరలకు ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు కేటాయించారని చెప్పారు. ఒకేసారి గంపగుత్తగా కాకుండా కొన్ని సంవత్సరాల కాలంలో అమరావతికి వచ్చి స్థిరపడే వారికోసం ఆ భూములు కేటాయించాలని సీఆర్డీఏ చట్టం లక్ష్యమన్నారు. అయితే, ఒకేసారి అందరికీ ఇళ్ల పట్టాలు అందించడం ద్వారా భూసమీకరణ స్ఫూర్తి, సీఆర్డీఏ చట్టానికి ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని వాదించారు.

మరోవైపు రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన వారిలో పేదలకు తక్కువ ధరలకు ఇళ్లు నిర్మించాలనే ఉద్దేశంతో భూసమీకరణ చేపట్టారని, ఇప్పుడు బయటి వారిని తీసుకొచ్చి ఇళ్ల పట్టాల పేరుతో భూములు అప్పగించడం చట్ట విరుద్దమని సీనియర్ కౌన్సిల్ అశోక్ భాన్ వాదించారు. ఒకవేళ ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలనుకుంటే సీఆర్డీఏ పరిధి బయట కూడా ఇవ్వొచ్చని చెప్పారు. అదే సమయంలో సీఆర్డీఏ చట్టం ప్రకారం రాజధాని పరిధిలో భూములు కేటాయించాలంటే కనీసం 100 మీటర్ల (సుమారు 120 గజాలు) కంటే ఎక్కువ కేటాయించాలని మరో న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు వాదించారు.
దీంతో అక్క‌డ చాలా మంది ఈ ప‌ట్టాలు అందుతాయా లేదా అని ఎదురుచూస్తున్నారు.

Content above bottom navigation