AP లో ఉచిత ఇళ్ల పట్టాల కొరకు లాటరీ పద్ధతి లాటరీ ఎలా తీస్తారు ? లిస్ట్ లో ఉన్న అందరికీ ఇల్లు వస్తుందా ?

133

ఏపీలో ప్రతీనెలా ఓ కొత్త ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెడుతున్నారు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి… ఇక రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పండుగ రోజు ప్రతిష్టాత్మకంగా పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం చేయ‌నుంది. దీనికోసం ప‌నులు చకచకా సాగుతున్నాయి. 25 లక్షల పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్‌పై అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. భూములను సేకరించి చదును చేయడం, ప్లాటింగ్, మార్కింగ్‌ జరుగుతోంది. లబ్ధిదారుల పేరిట ప్రభుత్వం రూ.పది స్టాంప్‌ పేపర్‌పై ఇంటి స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేసి అందించనుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రెవెన్యూ శాఖ జిల్లా అధికార యంత్రాంగానికి పంపింది.

పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో ని చూడండి..

ఇక కేవ‌లం 20 రోజులు మాత్ర‌మే స‌మ‌యం ఉంది, అయితే గ‌తంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో న‌గ‌దు క‌ట్టిన వారికి కూడా ఇళ్ల‌స్ధ‌లాలు, అలాగే పూర్తి అయిన ఇళ్ల‌ను అందించ‌నుంది జ‌గ‌న్ స‌ర్కార్.. దాదాపు ఇలా న‌గ‌దు చెల్లించిన వారు 1.57 ల‌క్ష‌ల మంది అని తేలింది..గ‌తంలో టీడీపీకి అమౌంట్ క‌ట్టారు ఆ స‌మయంలో బ్యాంకు చ‌లానా మాత్ర‌మే ఇచ్చారు.. కాని ఆ ఇళ్లులు ఇవ్వ‌లేదు దీంతో వారి డౌట్ ని ప్ర‌భుత్వం తీర్చింది…

ఇక ఇప్పుడు గ‌వ‌ర్న‌మెంట్ లాండ్స్ ఉన్న చోట్ల పేద‌ల‌కు ఉచితంగా ఇండివిడ్యువ‌ల్ ఇళ్లు కట్టించి ఇవ్వ‌నున్నారు, ఇక ప్రైవేట్ భూములు కొన్నచోట అపార్ట్ మెంట్లు క‌ట్టించి అక్క‌డ ఇళ్లు ఇవ్వ‌నున్నారు. ఇక దీనికి లాట‌రీ ప‌ద్ద‌తి అవ‌లంభించ‌నున్నారు.. కొంద‌రు పార్టీ నాయ‌కుల‌కే ఇళ్లు ఇచ్చారు అని విమ‌ర్శ‌లు వ‌స్తాయి, అందుకే ల‌బ్దిదారుల పేర్ల‌తో లాట‌రీ తీయ‌నున్నారు, అలా ముందు లాట‌రీలో ఎవ‌రి పేరు వస్తే వారికి ముందు ఇళ్లు నిర్మించి ఇవ్వ‌నున్నార‌ట‌

తాజాగా ఈ ఇళ్ల స్ధ‌లాల ప‌ట్టాలు ఎలా ఉంటాయి అనేది కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది.. రిజిస్ట్రార్‌ కార్యాలయ డాక్యుమెంట్‌ రూ.పది స్టాంపు పేపర్‌ తొలి పేజీలో లబ్ధిదారుడి సమాచారంతో పాటు తహసీల్దారు సంతకం ఉంటుంది. రెండో పేజీలో ఇంటి స్థలం, సరిహద్దు వివరాలు, తహసీల్దారు సంతకం ఉంటుం ది. మూడో పేజీ (ఫారం 32-ఏ)లో తహసీల్దారు / ప్రతినిధి ఎడమ చేతి బొటన వేలి ముద్ర వేసి పాస్‌పోర్టు ఫోటో అతికించి సంతకం చేసి చిరునామా పూరిస్తారు. తరువాత లబ్ధిదారులు/ ఆమె ప్రతినిధి ఎడమ చేతి బొటన వేలు ముద్ర వేసి పాస్‌ పోర్టు ఫొటో అతికించి సంతకం చేసి చిరునామా పూరిస్తారు. స్టాంప్‌ పేపర్‌పై సాక్షి, తహసీల్దారు సంతకాలు చేస్తారు.

Content above bottom navigation