AP లో రేషన్ కార్డు ఉన్న వారికి ఇచ్చే రేషన్ 9 సరుకుల లిస్ట్

AP Ration Card Items List
AP Ration Card Items List

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ రాష్టాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ప్రజలకు మేలు చేకూరేలా ఇప్పటికే అనేక పథకాలను రూపొందించారు. అలాగే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇంటికే వచ్చి సర్వీసులు అందించేలా గ్రామా వాలంటీర్లను నియమించాడు. అలాగే బియ్యం కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, ఫీజ్ రీమెంబర్స్ మెంట్ కార్డు..ఇలా నాలుగైదు కార్డులకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అందులో ముఖ్యమైనది బియ్యం కార్డు.

పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో ని చూడండి..

ఆంద్రప్రదేశ్ లో ఉన్న ప్రతి కుటుంబానికి కొత్తగా బియ్యం కార్డులు ఇచ్చారు. ఈ బియ్యం కార్డు ఉన్నవారికి ఒక్కొక్క మనిషికి ఐదు కిలోల చొప్పున బియ్యం ఇస్తారు. ఒకవేళ ఇంట్లో నలుగురు ఉంటె 20 కిలోల బియ్యం ఇస్తారు. ఇంతకముందు 20 శాతం నూకలు వచ్చేది కానీ ఇప్పుడు 15శాతమే నూకలు ఇవ్వనున్నారు. క్వాలిటీ రైస్ ఇకనుంచి ప్యాకేజిలలో వస్తుంది. 5కేజీ , 10కేజీ, 15కేజీ ..ఇలా ప్యాకేజుడ్ బ్యాగ్స్ ఇస్తారు. దీంతో ఎవరు కూడా కల్తీ చెయ్యడానికి వీలుండదు. ప్రభుత్వమే నాణ్యమైన బియ్యాన్ని ప్యాకేజుడ్ బ్యాగ్స్ లలో ఇస్తుంది. రైస్ తో పాటు కొన్ని ఐటమ్స్ కూడా ఇస్తారు. అవేమిటి అంటే.. షుగర్ ప్యాకెట్, ఉప్పు ప్యాకెట్, మంచినూనె, కందిపప్పు, గోధుమపిండి ప్యాకెట్ ఇస్తారు. ఏదైనా పండుగ వస్తే..శనగపప్పు, బెల్లం అనేది సెపరేట్ గా ఇస్తారు. వీటన్నిటిని ఫిబ్రవరి నుంచే ఇవ్వనున్నారు.

ఇక గ్రామా వాలంటీర్లకు కొత్తగా మొబైల్ ఫోన్స్ ఇచ్చారు. అందులో బయోమెట్రిక్ విధానాన్ని అమర్చారు. ఏప్రిల్ నుంచి రేషన్ ను హోమ్ డెలివరీ చేస్తారు. ఇప్పటికే రైస్ కార్డుకు సంబందించిన ఎలిజాబిలిటీ లిస్ట్ ను గ్రామ సచివాలయాలకు పంపించారు. ఆ లిస్ట్ లో కనుక మీ పేరు ఉంటె మీకు రేషన్ అందుతుంది. ఫిబ్రవరి మొదటివారంలో కొత్త రైస్ కార్డ్స్ ఇస్తారు. ఆ రైస్ కార్డ్స్ వచ్చాకా బియ్యంతో పాటు మిగతా ఐటమ్స్ ను తీసుకోవచ్చు. ఒకవేళ లిస్ట్ లో మీ పేరు లేకపోతే మీరు మళ్ళి అప్లై చేసుకోవచ్చు. కొత్త పెళ్లైన వారు రైస్ కార్డు కోసం డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం దగ్గరిలోని మీ సేవకు వెళ్లాలి. మీ సేవకు వెళ్లే ముందు ఆధార్ కార్డు, భాగస్వామి ఆధార్ కార్డు, రెండు ఫోటోలు, ఇద్దరి రేషన్ కార్డులు మీ వద్ద ఉంచుకోండి. మీసేవలో మీ పాత రేషన్ కార్డులో మీ పేరు తొలగిస్తారు. మీ భాగస్వామి పేరును కూడా వారి రేషన్ కార్డులో తీసేస్తారు. తర్వాత మీరు ఎంఆర్‌వో ఆఫీస్‌కు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ మీవి, మీ భాగస్వామి బయోమెట్రిక్స్ తీసుకుంటారు. తర్వాత మీకు ఒక అక్‌నాలెడ్జ్ నెంబర్ ఇస్తారు. తర్వాత మీరు 1100 నెంబర్‌కు ఫోన్ చేస్తే సరిపోతుంది. మీ కొత్త రేషన్ కార్డు స్టేటస్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

Content above bottom navigation