ఇంట్లో పాత నగలున్నవారికి షాకింగ్ న్యూస్

బంగారం కొనడం చాలా మందికి వెన్నతో పెట్టిన విద్యగా ఉంటుంది.. పదే పదే బంగారు వస్తువులు కొనడం వల్ల వారికి తరుగు మజూరీ వీఏ బంగారం కొనుగోళ్లు ఎలా చేయాలి అనేది తెలుస్తుంది.. అమ్మే సమయంలో కూడా తరుగు ఎంత పోతుంది అనేది తెలుస్తుంది, అయితే పెట్టుబడిగా బంగారం చూసుకోవాలి అంటే 24 క్యారెట్స్ చూసుకోవాలి.. ఇక ఆర్నమెంట్ అయితే మాత్రం 22 క్యారెట్స్ అనే చెప్పాలి, ఇక డైమెంట్ జ్యూయలరీ అయితే 18 అంతకంటే తక్కువ క్యారెట్స్ తో తయారు అవుతాయి అనేది తెలిసిందే.కాని ఇప్పడు బంగారం షాపుల్లో కూడా పోటీ వాతావరణం కనిపిస్తోంది , అందుకే ఎక్కడ పసిడి సరైనది దొరుకుతుంది అనేది తెలియడం లేదు.. ప్యూరిటీ విషయంలో చాలా మంది మోసపోతున్నారు. అందుకే కేంద్రం కూడా చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది, రోజు రోజుకి బంగారం అమ్మకాలు పెరుగుతున్నాయి, అందుకే 916 కేడీఎమ్ బంగారు ఆభరాణాలు మాత్రమే అమ్మాలి అని చెబుతోంది.

Image result for modi

పాతది దాదాపు 40 నుంచి 50 ఏళ్ల క్రితం మా నాయనమ్మ అమ్మమ్మ బంగారం అని సెంటిమెంట్ గా ఉంచుకున్న బంగారం ఇక కాస్త రేటు తగ్గించి ఇస్తారు, ఇక ఆ బంగారం కొనుగోళ్లు అమ్మకాలు జరగవు .. ఈ మధ్య బంగారం కొనుగోళ్లలో మోసాలు ఎక్కువగా జరుగుతున్న కారణంగా కొత్తగా ‘బీఐఎస్ హాల్ మార్క్‌’అనే ముద్రను తీసుకొచ్చింది కేంద్రం.ఇప్పుడంటే అన్ని బంగారు ఆభరణాలపై హాల్ మార్క్‌లు తప్పనిసరి అయిపోయాయి కానీ.. పాత కాలంలో ఇలాంటివి ఏమీ లేవు. కేవలం బంగారం రంగుని బట్టి దాన్ని గుర్తించేవారు. లేదా ఎంతో నమ్మదగిన కంసాలిని పెట్టి నగలని తయారు చేయించేవారు. కాలం మారే కొద్దీ.. బంగారం స్వచ్ఛత బట్టి ఇప్పుడు గ్రేడ్‌లని ఇస్తున్నారు. 916 కేడిఎం 14కే, 18కే, 22కే, 24కేలు ఉన్నాయి. ఇప్పుడు వాటితో పాటు బీఐఎస్ హాల్‌ మార్క్‌ కూడా తప్పనిసరి అట. ఇదే విషయాన్ని ప్రజా ప్రయోజనాల మంత్రిత్వ శాఖ జారీ చేసింది.

ఈ క్రింది వీడియోని చూడండి

వినియోగదారున్ని కల్తీ నుంచి కాపడమే వీరి ఉద్దేశ్యం. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు మోసపోకుండా.. బంగారం స్వచ్ఛతను తెలిపే క్యారెట్లు, హాల్‌మార్క్, బిల్లు ముఖ్యంగా ఉండాలని వారు తెలిపారు. దీంతో.. పాత నగలున్నవారు బాధపడక తప్పడం లేదు. ఎందుకంటే.. వాటిని ఇప్పుడు అమ్మినా.. వాటి విలువ చాలా తక్కువగా వస్తుంది సో మీరు కొత్త బంగారం కొంటే హల్ మార్క్ కచ్చితంగా చూసుకోండి, పాత బంగారు ఆభరణాలు కూడా వీలైనంత మార్చుకుంటే మంచిది అంటున్నారు వ్యాపారులు.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation