ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఈ బ్యాంకులు బంద్.. ఇదే చివరి అవకాశం ఆందోళనలో ప్రజలు

150

మీకు బ్యాంక్‌లో అకౌంట్ ఉందా? లేదంటే ఒకటి కన్నా ఎక్కువ బ్యాంకుల్లో ఖాతాలు కలిగి ఉన్నారా? అయితే మీరు ఈ విషయం గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. దేశంలో 10 బ్యాంకులు బంద్ కానున్నాయి. ఏప్రిల్ 1 వ తేదీ తర్వాత బ్యాంకుల సంఖ్య తగ్గిపోనుంది. అదేంటి బ్యాంకుల సంఖ్య ఎలా తగ్గుతుంది? అని అనుకుంటున్నారా? దానికి సంబంధించి పూర్తీ వివరాలు ఇప్పుడు చూద్దాం..

పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో ని చూడండి..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేబినెట్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఇందులో ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన అంశంపై చర్చ జరిగింది. బ్యాంకుల విలీనంపై ఈమె మరోసారి స్పష్టతనిచ్చారు. పది ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రక్రియ కొనసాగుతోందన్నారు. దీనికి ఎలాంటి రెగ్యులేటరీ ఇబ్బందులు లేవని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ బ్యాంకులతో టచ్‌లో ఉంటుందని తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి బ్యాంకుల విలీనం అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. దానికి సంబంధించిన ప్రక్రియ ప్రస్తుతం ముమ్మరం చేశామని ఆమె అన్నారు. అయితే 10 ప్రభుత్వ రంగ బ్యాంక్‌ లను నాలుగు బ్యాంక్‌ లుగా కుదించాలని కేంద్రం గతేడాది ప్రతిపాదించింది. దీనికి సంబంధించి కేంద్ర కేబినెట్ ఆమోదం కూడా లభించిందని, విలీన విషయమై బ్యాంక్‌ లతో ఎప్పటికప్పుడు మంతనాలు జరుపుతున్నామని నిర్మలా సీతారామన్ వివరించారు. ఈ విలీనానికి ఎలాంటి సమస్యలు లేవని ఆమె స్పష్టం చేశారు. దేశంలో ప్రపంచస్థాయి బ్యాంక్‌ లను తయారు చేసేందుకు, అలాగే సంక్షోభంలో చిక్కుకున్న బ్యాంకింగ్ వ్యవస్థను గట్టెక్కించేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విలీనం తర్వాత దేశంలో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంక్‌ లు మాత్రమే ఉంటాయి. ఇక ఏ ఏ బ్యాంకులు విలీనం అవుతున్నాయి అనే విషయానికి వస్తే..

  1. ఓరియంటల్ బ్యాంక్​ ఆఫ్ కామర్స్, యునైటెడ్​ బ్యాంక్ ఆఫ్ ఇండియాలను పంజాబ్​ నేషనల్ బ్యాంక్‌ లో కలుపుతున్నారు. దీని వలన రెండో అతి పెద్ద ప్రభుత్వ బ్యాంక్‌ లా పంజాబ్ నేషనల్ బ్యాంక్ అవతరించనుంది.
  2. కెనరా బ్యాంక్‌ లో సిండికేట్ బ్యాంక్​ ను విలీనం చేస్తున్నారు. దీని వలన కెనరా బ్యాంక్‌ నాల్గవ అతి పెద్ద ప్రభుత్వ బ్యాంక్‌ గా అవతరించనుంది.
  3. ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంక్‌ లను యూనియన్ బ్యాంక్‌ లో విలీనం చేస్తున్నారు. దీని వలన ఐదవ అతి పెద్ద ప్రభుత్వ బ్యాంక్‌ గా యూనియన్ బ్యాంక్ అవతరించనుంది.
  4. ఇండియన్​ బ్యాంక్‌ లో అలహాబాద్​ బ్యాంక్‌ ను విలీనం చేస్తున్నారు. దీని వలన ఏడవ అతి పెద్ద ప్రభుత్వ బ్యాంక్‌ గా ఇండియన్ బ్యాంక్‌ అవతరించనుంది.

బ్యాంకుల విలీనం ఇదే కొత్తేమీ కాదు. గతేడాది దేనా బ్యాంక్, విజయ బ్యాంకులను బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేశారు. దీని కన్నా ముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) అనుబంధ బ్యాంకుల విలీనం జరిగింది. ఎస్‌బీఐకి చెందిన ఐదు అనుబంధన బ్యాంకులను విలీనం చేశారు. అలాగే భారతీయ మహిళా బ్యాంక్‌ ను ఎస్‌బీఐలో కలిపేశారు. ఇలా సంక్షోభంలో ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థను గట్టెంకించేందుకు కేంద్ర ప్రభుత్వం విలీనం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఆయా బ్యాంకులలో మీకు అకౌంట్ ఉంటె వెంటనే బ్యాంకుకు వెళ్లి విలీనం గురించి పూర్తీ సమాచారం తెలుసుకోండి. మరి కేంద్రం చేస్తున్న ఈ బ్యాంకుల విలీనం మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.

Content above bottom navigation