అదిరిపోయే స్కీమ్ కేవలం రూ.5000/- కడితే చాలు ఏకంగా రూ. 11 లక్షలు మీ సొంతం

53

డబ్బు సంపాదించాలని ప్లాన్ భావిస్తున్నారా? అయితే మీకు ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. రోజు అలుపు లేకుండా కష్టపడుతున్నాం కాని పైసా పొదుపు అవ్వడం లేదని బాధపడే వారికి, అలాగే ఎంత జీతం వచ్చిన కూడా డబ్బు మిగలడం లేదని భాధపడే వారికీ ఈ అప్షన్ బెస్ట్ అప్షన్ అని చెప్పవచ్చు..ఆ అప్షన్ ఏంటంటే.. మీ వద్ద ఉన్న డబ్బును ఇన్వెస్ట్ చెయ్యడం.. ఇలా ఇన్వెస్ట్ చేస్తే మీతో ఉన్న కొంచెం డబ్బుతోనే మరింత డబ్బు సంపాదించొచ్చు. చేతిలో ఉన్న డబ్బును ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. బ్యాంక్‌లో డిపాజిట్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్‌లో పెట్టొచ్చు. ఇతర స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదంటే మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా డబ్బు పెట్టొచ్చు. స్టాక్ మార్కెట్ గురించి తెలిసి ఉంటే, అందులోనే డైరెక్ట్‌గా డబ్బు ఇన్వెస్ట్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్ గురించి తెలియకపోతే మ్యూచువల్ ఫండ్స్‌కు ప్రాధాన్యం ఇవ్వొచ్చు. రిస్క్ తీసుకోవడం ఇష్టం లేకపోతే బ్యాంక్‌ లేదా ఇతర స్కీమ్స్‌లో డబ్బులు పెట్టొచ్చు.

పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో ని చూడండి..

రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడే వారు స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో మంచి రాబడి పొందొచ్చు. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఇతర స్కీమ్స్‌ కన్నా ఎక్కువ రాబడే వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే దీర్ఘకాలంలో మంచి రాబడి పొందొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు పెడితే కొంత కాలం తర్వాత ఎంత పొందొచ్చనే అంశాన్ని సిప్ ఆన్‌లైన్ క్యాలిక్యులేటర్ ప్రకారం తెలుసుకోవచ్చు. ఎస్‌బీఐ సిప్ క్యాలిక్యులేటర్ ప్రకారం చూస్తే.. మీరు నెలకు సిప్ విధానంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తున్నారు. ఇలా మీరు పదేళ్లు ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగించాలని భావించారు.

మెచ్యూరిటీ సమయంలో మీకు రూ.11,61,695 వస్తాయి. ఇక్కడ వార్షిక రాబడిని 12 శాతంగా పరిగణలోకి తీసుకున్నాం. ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ పండ్ మంచి పనితీరు కనబర్చలేదని అనుకుంటే.. 12 శాతం కాకుండా 8 శాతం వార్షిక రాబడిని పరిగణలోకి తీసుకుంటే.. అప్పుడు మీకు రూ.9,20,828 వస్తాయి. మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో నెలకు రూ.5,000 కాకుండా రూ.10,000 ఇన్వెస్ట్ చేయాలని భావించారు. ఇలా పదేళ్ల పాటు ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు మీకు మెచ్యూరిటీ సమయంలో రూ.18,41,656 వస్తాయి. ఇక్కడ 8 శాతం రాబడిని పరిగణలోకి తీసుకున్నాం. అదే 12 శాతం రాబడి ప్రకారం చూస్తే.. రూ.23 లక్షలకు పైనే వస్తుంది. కాబట్టి డబ్బు సంపాదించాలంటే ఈ మార్గాలలో ట్రై చెయ్యండి.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation