బిగ్ బ్రేకింగ్ రూ. 2000 నోటు బంద్ అవుతుందా

75

ప్ర‌స్తుతానికి దేశ వ్యాప్తంగా మరొక సంచలనమైన వార్త దేశ ప్రజలందరినీ కూడా కలచివేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో దేశంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చాక 2016 నవంబర్ 8న పెద్ద నోట్లను బంద్ చేసి అప్పట్లో పెద్ద చర్చకు తెరలేపారు… ఆ తరుణంలో దేశ వ్యాప్తంగా రూ. 2000 నోటును ప్రవేశపెట్టారు. కానీ ఇప్పుడు కేంద్రప్రభుత్వం మరొక సంచలనమైన నిర్ణయాన్ని తీసుకుందని సమాచారం. కాగా ఇప్పటినుండి దేశ వ్యాప్తంగా రూ.2000 నోటు బంద్ అవుతోందంటూ సామాజిక మాంద్యమాల్లో చాలా ప్రచారం జరుగుతుంది. ఈమేరకు తక్షణమే తమ వద్ద ఉన్నటువంటి నోట్లను మార్చుకోవాలని పుకార్లు కూడా పుట్టిస్తున్నారు.దేశ వ్యాప్తంగా రూ.2000 నోటు బంద్ అవుతోందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం అవుతోంది. ప్రముఖ సామాజిక మాధ్యమం అయిన ట్విట్టర్‌లో యూజర్లు దీనికి సంబంధించిన చర్చను జోరుగా జరుపుతున్నారు. త్వరగా రూ.2000 నోట్లను మార్చుకోవాలంటూ సలహాలు ఇస్తున్నారు. ఆర్బీఐ త్వరలో రూ.2000 నోట్లను రద్దు చేస్తోందంటూ పుకార్లు రేపుతున్నారు.

Image result for 2000 నోటు బంద్

దీనికి తగ్గట్టే ప్రముఖ ఐటీ నిపుణుడు, హైదరాబాద్‌కు చెందిన నల్లమోతు శ్రీధర్ కూడా దీనిపై తన ఫేస్ బుక్ ఖాతాల్లో ఓ కామెంట్ పోస్ట్ చేశారు. ‘2000 రూపాయల నోట్లు గురించి ఇపుడు అన్ని బ్యాంక్ లకు సమాచారం వస్తోంది. నేను గంట క్రితం రాస్తే ఫేక్ న్యూస్ అన్న కొందరు బ్యాంక్ మేనేజర్ లు ఇప్పుడు appreciate చేస్తున్నారు …. నేను ఆధారాలు లేనిదే ఎప్పుడూ ఏది రాయను. రేపటి నుండి ఏటీఎం లలో 2000 నోట్లు పెట్టరు. బ్యాంక్ లు కస్టమర్ లకు వాటిని ఇవ్వకూడదు. కేవలం డిపాజిట్ చేయొచ్చు అంతే.అని ఆయన పోస్ట్ పెట్టారు.2016 నవంబర్ 8న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నోట్ల రద్దు ప్రకటించారు. అప్పటి వరకు వాడుకలో ఉన్న రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేశారు.

ఈ క్రింది వీడియోని చూడండి

ఆ స్థానంలో కొత్తగా రూ.2000 నోట్లు, రూ500 నోట్లను తీసుకొచ్చారు. దేశంలో నల్లధనాన్ని నిరోధించేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. అయితే, నోట్ల రద్దు విఫల ప్రయోగం అని ప్రతిపక్షాలు మండిపడ్డాయి.రూ.2000 నోట్లు ముద్రించిన తర్వాత కూడా చాలా మంది దీనిపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీన్ని కూడా ఎప్పటికైనా రద్దు చేస్తారనే అభిప్రాయం చాలా మంది ప్రజల్లో ఉంది. అలాగే, చాలా మంది రూ.2000 నోట్లను కూడా రద్దు చేయాలనే డిమాండ్లు కూడా తెరమీదకు తీసుకువచ్చారు. అయితే నిరుపేద‌లు మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారికి దీని వ‌ల్ల ఇబ్బంది ఉండ‌దు వారు అకౌంట్ లో న‌గ‌దు వేసుకోవ‌చ్చు, ఇక కోట్ల రూపాయ‌ల న‌ల్ల ద‌నం ములుగుతున్న బ‌డాబాబుల‌కే ఇది పెద్ద ఇబ్బంది.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation