డ్రైవింగ్ లైసెన్స్ లేనివారికి శుభవార్త అస్సలు ఊహించి ఉండరు ఏంటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు

91

ఇక మీరు డ్రైవింగ్ లైసెన్స్ కోసం రోజుల త‌ర‌బ‌డి కార్యాల‌యం చుట్టు తిర‌గ‌క్క‌ర్లేదు
అంతా ఆన్ లైన్ లోనే మీకు డ్రైవింగ్ లైసెన్స్ పొందే సులువైన మార్గం వ‌చ్చేసింది.
రవాణా శాఖ కార్యాలయం చుట్టూ, దళారుల చుట్టు తిరిగితే కానీ కనీసం లెర్నింగ్ లైసెన్స్ LLR కూడా అందుకొని పరిస్థితి నేడు ఉంది, కాని ఇలాంటి ఇబ్బందులు లేకుండా ర‌వాణాశాఖ స‌రికొత్త ప‌ద్ద‌తి అమ‌లులోకి తీసుకువ‌చ్చింది.

పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో ని చూడండి..

లైసెన్స్ కోసం కొద్ది రోజుల ముందు దరఖాస్తు ఇవ్వడం అర్హత పరీక్ష రాయడం, ఉతీర్ణత సాధించడం ప్రజలకు ఇబ్బంది కరంగా మారింది. అందుకే ఆర్టీఏ డిపార్ట్ మెంట్ మార్పులు తీసుకువ‌చ్చింది. ఇక ర‌వాణాశాఖ కార్యాలయానికి రాకుండానే LLR పొందడానికి చర్యలు మొదలు అయ్యాయి, ఆన్ లైన్ లోనే పరీక్షలు నిర్వహించి LLR లు జారీ చేయనున్నారు. ఈ మేరకు ఎంపిక చేసిన ప్రాంతాలు కేంద్రాలలో ఇందుకోసం కియో స్కూల్ ఏర్పాటు చేయనున్నారు.

ధ‌ర‌ఖాస్తు దారుడు దీని కోసం తన ఆధార్ నెంబర్ నమోదు చేయాలి. ఆ పై పరీక్ష న‌గ‌దు ఆన్ లైన్లో చెల్లించాలి. తర్వాత LLR కు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. వీటిని కేటాయించిన సమయంలో పూర్తి చేయాలి. వీటిలో ఉతీర్ణత సంపాదిస్తే LLR మీకు వస్తుంది. అలాగే దరఖాస్తు దారులు ఇ మెయిల్ కి దీనికి సంబంధించిన పత్రం వెళ్తుంది.

పరీక్ష సమయంలో దరఖాస్తు దారుడే రాసేలా కెమెరా నిఘా ఉండేలా ఏర్పాటు చేయాలి అని రవాణా శాఖ నిర్ణయించింది. విదేశాలకు ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థులు GRE , TOEFL పరీక్షలు ఆన్ లైన్లో రాస్తున్నారు ఇదే తరహాలో LLR పరీక్ష ఉంటుంది. అలాగే ఎంపిక చేసిన ఇంజనీరింగ్ కాలేజీలలో వీటి ఏర్పాటు చేస్తారు. చూశారుగా ఇక లైసెన్స్ కావాలి అంటే పెద్ద ఇబ్బంది ప‌డాల్సిన అవ‌స‌రం లేదు ..మీకు సులువుగా ఇంటికే లేదా ఈమెయిల్ కే లైసెన్స్ కార్డు వ‌స్తుంది.

Content above bottom navigation