ఫేస్ బుక్ లో మీకు తెలియని సీక్రెట్ ట్రిక్స్ తప్పక తెలుసుకోండి

79

ఫేస్‌బుక్‌.. ఈ పేరు గురించి నేటి తరం వాళ్లకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యూజర్ల ఇష్టాయిష్టాలు, వాళ్ల జీవన విధానాలు, వారు ఏ రాజకీయ పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు తదితర వివరాల పట్టిక తయారు చేయగలిగే సామర్థ్యం ఫేస్‌బుక్‌కు ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే కొత్త ఫేస్‌బుక్‌లో జాయిన్ అయిన చాలా మంది మిత్రులు ఫేస్‌బుక్ వెబ్‌సైట్‌ను సమర్థవంతంగా వినియోగించుకోవటంలో తడబడుతున్నారు. అలాంటి వారికి ఇప్పుడు తెలుసుకోబోయే టిప్స్ చాలా బాగా ఉపయోగపడతాయి.

పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో ని చూడండి..

చికాకు పుట్టించే గేమింగ్ నోటిఫికేషన్స్‌ను టర్నాఫ్ చేయాలంటే.. ముందుగా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి. ఆ తరువాత యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి యాప్ రిక్వెస్ట్‌లను టర్నాఫ్ చేస్తే సరిపోతుంది. ఫేస్‌బుక్ నుంచి ట్విట్టర్‌లో పోస్ట్ చేయాలంటే.. ముందుగా ట్విట్టర్ అకౌంట్‍లోకి లాగిన్ అవ్వండి. ప్రొఫైల్ ఇమేజ్ పై క్లిక్ చేసి సెట్టింగ్స్‌ను సెలక్ట్ చేసుకుని ఫేస్‌బుక్‌ను కనెక్ట్ చేసుకుంటే చాలు. మీరు షేర్ చేసే పోస్ట్‌లను కొద్ది మంది మాత్రమే చూడాలంటే.. విజబిలిటీ సెట్టింగ్స్‌ను మార్చుకోవటం ద్వారా మీరు షేర్ చేసే పోస్ట్‌లను మీకు నచ్చిన వారి మాత్రమే పంపుకోవచ్చు.

మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోని మొత్తం డేటాను ఓ కాపీ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవాలంటే.. సెట్టింగ్స్‌లోకి వెళ్లి జనరల్ టాబ్ క్రింద కనిపించే డౌన్‌లోడ్ ఎ కాపీ పై క్లిక్ చేసినట్లయితే మీ ఫేస్‌బుక్ డేటా మొత్తం ఓ కాపీ రూపంలో డౌన్‌లోడ్ అయిపోతుంది. ఫేస్‌బుక్ లాగిన్ అప్రూవల్స్ ద్వారా అదనపు సెక్యూరిటీని పొందటం ఎలాగంటే.. ముందుగా మీ అకౌంట్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి సెక్యూరిటీని సెలక్ట్ చేసుకుని అందులోని లాగిన్ అప్రూవల్స్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేసినట్లయితే ఇతర వెబ్ బ్రౌజర్‌ల నుంచి లాగిన్ అయిన ప్రతిసారీ మీకు లాగిన్ అప్రూవల్‌ను పంపిస్తుంది.

Content above bottom navigation